సిద్ధిపేట జిల్లాలో పలు సీడ్స్ కంపెనీలలో ఆకస్మిక తనిఖీలు

by Shyam |
సిద్ధిపేట జిల్లాలో పలు సీడ్స్ కంపెనీలలో ఆకస్మిక తనిఖీలు
X

దిశ, మెదక్: సిద్ధిపేట పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం జిల్లాలోని సిరి సీడ్స్, మహేంద్ర అగ్రి సొల్యూషన్స్ సీడ్స్, కావేరి సీడ్స్ మర్కుక్ కంపెనీలలో ఆదివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు, అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనుమానం ఉన్న సీడ్స్ ప్యాకెట్లను సీజ్ చేసి హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో ఉన్న పరీక్షా కేంద్రానికి పంపించారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ ఏసీపీ సురేంద్ర మాట్లాడుతూ.. కంపెనీలలో తనిఖీలు నిర్వహించినప్పుడు లేబుల్, క్యూఆర్ కోడ్, ప్యాకింగ్, మ్యానుఫ్యాక్చర్ తేదీ, స్టాక్ రిజిష్టర్, డెలివరీ రిజిష్టర్, విత్తనాల యొక్క నాణ్యతను పరిశీలించినట్లు ఆయన తెలిపారు. నిబంధనలు పాటించని సీడ్స్ కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాలలో ఎవరైనా వ్యక్తులు నకలీ విత్తనాలు అమ్మడానికి వస్తే వారి దగ్గర రైతులు విత్తనాలు కొనుగోలు చేయొద్దని సూచించారు. ప్రభుత్వ అనుమతి పొందిన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. విత్తనాలకు సంబంధించిన రసీదును పంటలు పండేంతవరకూ జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. ఎవరైనా గ్రామాల్లో నకిలీ విత్తనాలు అమ్మడానికి వస్తే డయల్ 100, లేదా సిద్ధిపేట పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ నెంబర్ 7901100100 ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. తరచుగా సీడ్స్, ఫర్టిలైజర్ కంపెనీలలో, షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయించేవారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామన్నారు.

Advertisement

Next Story