‘సాక్ష్యాలన్నీ దొరికాకే అచ్చెన్నాయుడి అరెస్టు’

by srinivas |
‘సాక్ష్యాలన్నీ దొరికాకే అచ్చెన్నాయుడి అరెస్టు’
X

దిశ, ఏపీ బ్యూరో: సాక్ష్యాలన్నీ దొరికిన తరువాతే టీడీపీ నేత అచ్చెన్నాయుడును అరెస్టు చేశారని ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు.

అచ్చెన్నాయుడు అరెస్టుపై ఆమె మాట్లాడుతూ.. పార్టీ మారాలని అచ్చెన్నాయుడును కోరామనడం సిగ్గుచేటని విమర్శించారు. వైఎస్సార్సీపీపై బురద చల్లడమే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. కార్మిక శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు స్వయంగా డైరెక్టర్లను బెదిరించి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్దమని డైరెక్టర్లు చెప్పినా ఆయన వినిపించుకోలేదన్నారు.

ఇందులో ఇంకొంతమంది పెద్దల ప్రమేయముందని, విచారణలో అన్నీ తేలుతాయని ఆమె తెలిపారు. జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబం చేసిన అక్రమాలు చాలనే ఉన్నాయన్నారు. ఇన్సూరెన్స్‌ లేని బస్సులు తిప్పి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడి, నీతులు చెబుతుంటే ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.

Advertisement

Next Story