బుచ్చయ్య చౌదరిపై నిప్పులు చెరిగిన సుచరిత

by srinivas |
బుచ్చయ్య చౌదరిపై నిప్పులు చెరిగిన సుచరిత
X

టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై హోం మంత్రి మేకతోటి సుచరిత నిప్పులు చెరిగారు. తన ట్విట్టర్ ఖాతాలో దొంగల పార్టీ ప్రచారం… అసలు వాస్తవం అంటూ సీఎం జగన్‌కు సంబంధించిన రెండు వీడియోలు పోస్టుచేసిన ఆమె బుచ్చయ్య చౌదరిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ వీడియోలు పోస్ట్ చేయొద్దని ఆమె సూచించారు.

‘వయసు పెరిగితే సరిపోదు, బుద్ధి కూడా పెరగాలి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారూ. వీలైనంత వరకు కాంట్రాక్టు ఉద్యోగుల్ని ప్రభుత్వంలోకి లాగేద్దాం అన్న జగన్ గారి మాటలను ఇలా మూడు సెకన్ల వీడియోతో దిక్కుమాలిన ట్వీట్లు చేస్తూ యువతకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? అంటూ నిలదీశారు. కాస్త హుందాగా ప్రవర్తించండి అని హితవు పలికారు. తప్పుడు వీడియోలు పోస్టు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు’ అని సుచరిత హితవు పలికారు.

కాగా, ‘ప్రభుత్వంలోకి లాగేద్దాం’ అని జగన్‌ అన్నారంటూ బుచ్చయ్య చౌదరి ఇటీవల ఒక వీడియోను పోస్ట్ చేశారు. ‘ఏమి లాగేస్తారో కొంచెం వివరిస్తారా…? అంటూ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన సుచరిత వీలైనంత వరకు కాంట్రాక్టు ఉద్యోగుల్ని ప్రభుత్వంలోకి లాగేద్దామంటూ జగన్‌ మంచి విషయాలు చెప్పారని అన్నారు.

tags: mekathoti sucharitha, ysrcp, jagan, twitter, video, gorantla buchaiah choudary,

Advertisement

Next Story