- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమాన పనికి సమాన వేతనం.. కార్మికులందరూ ఐక్యంకండి
దిశ, మణుగూరు : సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐ.ఎఫ్.టి.యు రీజియన్ జనరల్ బాడీ సమావేశాన్ని విజయప్రదం చేయలని ఐ.ఎఫ్.టి.యు జిల్లా అధ్యక్షులు డి.ప్రసాద్ కోరారు. ఆదివారం మండలంలోని ఐ.ఎఫ్.టి.యు కార్యాలయంలో ఐ.ఎఫ్.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేన్ని ఏర్పాటు చేశారు. ప్రసాద్ మాట్లాడుతూ.. సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, ఐ.ఎఫ్.టి.యు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై గత20 సంవత్సరాలుగా పోరాడుతున్నమన్నారు. కార్మికులకు కనీస వేతనాలు, సీఎం పీఎఫ్, బ్యాంకు ద్వారా వేతనాలు, బోనస్, వైద్యం తదితర హక్కులను సాధించుకున్నప్పటికీ ఇంకా సాధించాల్సినవసరం ఎంతో ఉందన్నారు. రోజు రోజుకు పేరుగుతున్న నిత్యవసరసరకుల ధరలకు అనుగుణంగా కనీసవేతనాలను పెంచాల్సినవసరం ఉందన్నారు. దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమలో పనిచేస్తున్న పర్మినెంట్ కార్మికులకు నిర్ణయించినట్లుగానే కాంట్రాక్టు కార్మికులకు నిర్ణయించి వేజ్ బోర్డులలో వేతనాలు పెంచాల్సినవసరం ఉందన్నారు.
సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, ఐ.ఎఫ్.టి.యు బొగ్గు పరిశ్రమలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ మొదటి కేటగిరి వేతనం అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమానపనికి సమానవేతనం అమలు చేసే విధంగా పోరాటాలు చేద్దామన్నారు. దీనిలో భాగంగానే కాంట్రాక్టు కార్మికులందరినీ ఐక్యం చేసి ఈనెల 12వతేదీన మండంలోని ఐఎఫ్టీయూ కార్యాలయ ప్రాంగణంలో ఐ.ఎఫ్.టి.యు రీజియన్ స్థాయి జనరల్ బాడీని సమావేశం జరుగుతుందన్నారు. ఈసమావేశాన్ని కాంట్రాక్టు కార్మికులందరు అధికసంఖ్యలో పాల్గొని విజయప్రదం చేయాలని కార్మికులను కోరారు. ఈ సమావేశంలో సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రీజియన్ అధ్యక్షులు ఎన్.సంజీవ్,ఐ.ఎఫ్.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి, కోశాధికారి గోనెల రమేష్, ఐ.ఎఫ్.టి.యు జిల్లా నాయకులు పి.సతీష్, మణుగూరు ఏరియా నాయకులు ఎండి.గౌస్, ఎం.శ్రీనివాస్ రెడ్డి, వి.జానయ్య, చారి, ఎం. రాజేందర్, త్రిమూర్తులు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.