‘నేతాజీ’ అస్థికలకు DNA టెస్టు చేయించండి..

by Shamantha N |   ( Updated:2021-08-18 12:09:12.0  )
subash-chandra-bose
X

దిశ, వెబ్‌డెస్క్ : నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు సూర్య కుమార్ బోస్ మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. తన తాతయ్య అస్థికలకు DNA పరీక్ష జరిపించాలని.. అందుకోసం జపాన్‌లోని రెంకోజీ దేవాలయం నుండి భారత స్వాతంత్ర్య సమరయోధుడి అస్థికలను తిరిగి తీసుకురావాలని విదేశాంగశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ‘‘దాదాపు రెండు దశాబ్దాల కిందట DNA పరీక్ష నిర్వహించడానికి, నేతాజీ అవశేషాలను తన ప్రియమైన మాతృభూమికి తీసుకురావడానికి ఒక విలువైన అవకాశం వచ్చినప్పటికీ.. ఇండియన్ గవర్నమెంట్ దానిని కోల్పోయింది’’ అని ఆయన విచారం వ్యక్తంచేశారు.

స్వాతంత్య్ర సమరయోధుడికి సంబంధించిన అన్ని రహస్య ఫైళ్లను డిక్లాసిఫికేషన్ చేయాలనే డిమాండ్ కోసం బోస్ 2015లో బెర్లిన్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసిన విషయం తెలిసిందే. “సుభాస్ బోస్ కేవలం తన కుటుంబానికి చెందినవాడు కాదు. దేశం మొత్తం తన కుటుంబం అని ఆయన స్వయంగా చెప్పారు” అని అప్పట్లో మనవడు చెప్పాడు. ఇంతకుముందు, నేతాజీ కుమార్తె అనితా బోస్ పిఫాఫ్ కూడా తన తండ్రికి సంబంధించిన గుర్తులను, అస్థికలను స్వదేశానికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేయాలని భారతదేశం మరియు జపాన్ ప్రభుత్వాలను అభ్యర్థించారు.
Advertisement

Next Story