- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అవధ్..సింధ్ ఆక్రమణలు: (ఇండియన్ హిస్టరీ -గ్రూప్స్ ఎగ్జామ్స్ స్పెషల్)

అవధ్ ఆక్రమణ (1856):
గవర్నర్ జనరల్ - డల్హౌసీ
అవధ్ రాజ్యాన్ని స్థాపించింది - సాదత్ అలీ
చివరి పాలకుడు - వాజిద్ అలీషా
1856లో వాజిద్ అలీషా తప్పుడు పాలన చేస్తున్నాడనే నెపంతో బ్రిటీష్ గవర్నర్ జనరల్ డల్హౌసీ అవధ్‌ను ఆక్రమించాడు.
సింధ్ ఆక్రమణ (1843):
గవర్నర్ జనరల్ -ఎలెన్‌బరో
సింధ్‌ను బెలుచిస్తాన్‌కు చెందిన తల్పూరా అనే తెగ పాలించింది.
సింధ్ అనేక ప్రాంతాలుగా విభజించబడి ఉండేది.
ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క గిరిజన నాయకుడు పాలించేవాడు.
ఈ నాయకుడిని అమీర్ అనేవారు.
1889లో సింధ్ అమీర్‌లు బ్రిటీష్ వారితో సైనిక సహకార ఒప్పందమును కుదుర్చుకున్నారు.
దీని ప్రకారం సింధ్ సరిహద్దు ప్రాంతాలకు బ్రిటీష్ రక్షణ కల్పించింది.
1843లో రష్యా భారతదేశంపై సింధ్ మీదుగా దాడిచేసే అవకాశం ఉందని భావించి సింధ్‌ను ఆక్రమించుటకు బ్రిటీష్ వారు నిర్ణయించారు.
అప్పటి గవర్నర్ జనరల్ ఎలెన్‌బరో సింధ్ ఆక్రమణకు చార్లెస్ నేపియర్ అనే జనరల్‌ను పంపాడు.
1848లో అతి సునాయసంగా చార్లెస్ నేపియర్ సింధ్ అమీర్‌లను ఓడించి సింధ్‌ను ఆక్రమించాడు.