కరోనా బాధితుల్లో.. పదేళ్ల పిల్లోడి మనస్తత్వం!

by sudharani |
కరోనా బాధితుల్లో.. పదేళ్ల పిల్లోడి మనస్తత్వం!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ఇప్పటికే లక్షలాది మందిపై ప్రభావం చూపింది. అయితే కొవిడ్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య అధికంగా ఉండటం కాస్త మంచి విషయంగా తోస్తున్నా.. ఈ మహమ్మారి వల్ల భవిష్యత్తులో తలెత్తే దీర్ఘకాలిక సమస్యలపైనే ఇప్పటికీ క్లారిటీ లేదు. కరోనా వైరస్ నుంచి కోలుకున్న కొంతమందిలో మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతోందని, మానసిక సమస్యలకు దారితీస్తోందని తాజా పరిశోధనలో వెల్లడైంది.

ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్‌కు చెందిన డాక్టర్ ఆడమ్ హ్యాంప్‌షైర్ కరోనా నుంచి కోలుకున్న దాదాపు 84,285 మందిపై గ్రేట్ బ్రిటీష్ ఇంటెలిజెన్స్ టెస్ట్ నిర్వహించాడు. ఆ అధ్యయన ఫలితాలను మెడిగ్జివ్ (MedRxiv) వెబ్‌సైట్‌లో పబ్లిష్ అయ్యాయి. ఈ పరిశోధన ద్వారా మహమ్మారి బారిన పడిన రోగుల మెదడులో కొత్త సమస్యలను పరిశోధకులు గుర్తించారు. కరోనా నుంచి బయట పడినప్పటికీ కొన్ని నెలల నుంచి వారు తీవ్రమైన మానసిక ఆందోళన చెందుతున్నారని ఈ పరిశోధనల్లో వెల్లడైంది.

అంతేకాదు కరోనా సోకినవారిలో మెదడు పనితీరు చాలావరకు తగ్గిపోయిందని, వీరి మనస్తత్వం 10 సంవత్సరాల పిల్లాడిలా మారిపోయిందని శాస్త్రవేత్తలు తెలియజేశారు. అంతేకాకుండా, వీరిలో మతిమరుపు లక్షణాలు ఉన్నాయా? అన్న కోణంలో పరిశోధనలు జరిపి వారిని పదాలను గుర్తించడం, పజిల్ నింపడం వంటి పరీక్షలు నిర్వహించడం ద్వారా వారి మెదడు దాదాపుగా బలహీన పడినట్లు నిర్ధారించారు.

Advertisement

Next Story

Most Viewed