- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వృత్తి విద్యా కోర్సులపై మక్కువ
కాలానికనుగుణంగా విద్యావ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సర్టిఫికెట్ చదువులకన్నా వృతి విద్యా కోర్సులకు డిమాండ్ ఏర్పడింది. విద్యార్థుల నైపుణ్యం మెరుగుపడడంతోపాటు ఉద్యోగావకాశాలు మెండుగా లభిస్తుండడంతో ఐటీఐకి ప్రాధాన్యం ఏర్పడింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), కంప్యూటర్, కమ్యూనికేషన్ టెక్నాలజీ లాంటి కోర్సుల కంటే ఐటీఐలో చేరేందుకే విద్యార్థులు మక్కువ చూపుతున్నారు. ఫలితంగా ఐటీఐలు ప్రతీ యేటా విద్యార్థులతో కళకళలాడుతూ ఎవర్ గ్రీన్‌గా వెలుగొందుతూ వస్తున్నాయి.
దిశ, మల్కాజిగిరి: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మూడు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలు ఉన్నాయి. మేడ్చల్, అల్వాల్, చెర్లపల్లి ఐటీఐలో ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారా అడ్మిషన్లు జరుగుతున్నాయి. అల్వాల్ ఐటీఐలో 6 ట్రేడ్లలో కలపి మొత్తం 216 సీట్లు ఉన్నాయి. ఎలక్ట్రిషియన్ కోర్సులో 40, ఫిట్టర్లో 40, మెకానికల్ కోర్సులో 24, సివిల్‌లో 48, వెల్డర్‌లో 40, డీజిల్ మెకానిక్‌లో 24 సీట్లు ఉన్నాయి. ఇందులో సీనియర్ విద్యార్థులు కాకుండా ఈయేడు డిసెంబర్ 15వ తేదీ నాటికి మొత్తం 123 మంది కొత్త విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. అడ్మిషన్‌కు ఇంకా గడువు ఉండడంతో మరికొంత మంది విద్యార్థులు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రతీయేటా 100 మందికి ఉపాధి..
అల్వాల్ ఐటీఐ నుంచి ప్రతీ యేటా దాదాపుగా 150 మంది విద్యార్థులు శిక్షణ పూర్తి చేసుకుని బయటికి వెళ్తుంటారు. ఇందులో దాదాపుగా 100 మంది విద్యార్థులకు వివిధ పబ్లిక్, ప్రైవేట్ కంపెనీలు, వివిధ సంస్థల్లో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇందులో మేధా సర్వ్ డ్రైన్ ( రైల్వే పార్స్ ఉత్పత్తుల సంస్థ), లింక్ వేల్ (మీటర్ రీడింగ్ ఐటమ్ తయారీ సంస్థ), పావని ఇంజినీరింగ్ (ఏసీల తయారీ సంస్థ), ఈ –కోల్డ్ అల్యూమీనియం ఎలక్ట్రానిక్స్, ఐచర్ కంపనీలు ఉన్నాయి. ఉపాధి కల్పనకు సంబంధించి పై కంపెనీలతో ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నట్టు అల్వాల్ ఐటీఐ ప్రిన్సిపాల్ శంకరయ్య తెలిపారు.
గ్రేడింగ్‌లో నెంబర్ వన్..
మేడ్చల్ జిల్లాలో మూడు ప్రభుత్వ ఐటీఐలు ఉండగా అం దులో అల్వాల్ ఐటీ ఐ గ్రేడింగ్‌లో ఫస్ట్‌ప్లేస్‌లో ఉంది. దీంతో ఇందు లో చేరేందు కు విద్యార్థులు ప్రాధాన్యం ఇస్తున్నారు. గతేడాది కోర్సులు పూర్తి చేసి బయటికి వెళ్లిన 128విద్యార్థుల్లో 100 మందికి ఉద్యోగాలు లభించాయి. ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులకు ఉపాధి కల్పించేందుకు 350 కంపెనీలతో ఎం వోయూ కుదుర్చుకున్నాం. సుమారు 30 మందికి నవరత్న కంపెనీల్లోనూ ఉద్యోగాలు లభించాయి.
– ప్రిన్సిపాల్ శంకరయ్య, అల్వాల్ ఐటీఐ
జాబ్ గ్యారంటీ అని చేరాను..
నేను ఐటీఐ ఫిట్టర్ సెకండ్ ఇయర్ చేస్తు న్నా. వృత్తి విద్య కోర్సు లు చదివితే ఉద్యోగం గ్యారంటీగా లభిస్తుంది. మా పేరెంట్స్ కూడా ప్రోత్సహించారు. దీంతో ఐటీఐలో చేరాను. ప్రస్తుతం మార్కెట్లో ఐటీఐకి మంచి డిమాండ్ఉంది.
–డీ సురేష్, ఫిట్టర్ సెకండ్ ఇయర్
శిక్షణ బాగుంది..
మా నాన్న కార్పెంటర్. నన్ను డ్రాప్ట్‌మెన్ సివిల్ ఇంజినీర్ చేయించాలని భావించారు. దీంతో నేను ఐటీఐలో చేరి డీసీ చేస్తున్నా. ఇక్కడ టీచింగ్ కూడా బాగుంది. జాబ్ తప్పకుండా లభిస్తుందని ఆశిస్తున్నా.
-బీ మణిచంద్రాచారి, డ్రాప్ట్‌మెన్ సివిల్ సెకండ్ ఇయర్