- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వైన్‌షాపు ఏర్పాటును వ్యతిరేకంగా నిరవధిక నిరాహారదీక్ష చేస్తామంటున్న విద్యార్థులు..
దిశ, నాచారం: నిత్యం రద్దీగా ఉండే మల్లాపూర్ చౌరస్తా శివ హోటల్ బస్‌స్టాప్ వద్ద వైన్‌షాప్‌ను ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. వైన్స్ ఏర్పాటు చేయొద్దని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. విద్యార్థినిల నిరసనకు అఖిల భారత యువజన సమాఖ్య(ఏ ఐ వై ఎఫ్) విద్యార్థి సంఘం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఏ ఐ వై ఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. పాలకులకు మద్యపానం పై ఉన్న శ్రద్ధ.. మహిళా, విద్యార్థినుల రక్షణపై లేకపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.
అసలే నిత్యం రద్దీగా ఉండే చౌరస్తాలో వైన్స్ ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరుగుతాయన్నారు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా..?అని వారు ప్రశ్నించారు. ప్రజా వినియోగ బస్‌స్టాప్‌లా లేక బార్‌స్టాప్‌లా అని వారు ఎద్దేవా చేశారు. మేధో సంపత్తిని పెంపొందించే విద్యాలయాలకు కూతవేటు దూరంలోనే ఈ మద్యం షాపులు ఏర్పాటు చేయడం సిగ్గు చేటన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యార్థులు చదువులకు వివిధ కారణాలతో దూరం అవుతున్నారని తెలిపారు.
చదువు”కొను”టకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో, ఈ రకంగా విద్యాలయాలకు సమీప దూరం లో మద్యం మార్ట్‌లు ఏర్పాటు చేయడం శోచనీయమన్నారు. తక్షణమే మేడ్చల్ జిల్లా అబ్కారీ శాఖ ఈ వైన్ షాప్ కి అన్ని రకాల అనుమతులను రద్దు చేయాలని విద్యార్థీనిలు, విద్యార్థీ నాయకులు డిమాండ్ చేశారు.