- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విద్యార్థిని బలితీసుకున్న లారీ.. మజ్లిస్ ఆధ్వర్యంలో భారీ నిరసన
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. లారీ ఢీకొని ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి నగరంలోని ఖిల్లా రోడ్డులో వెలుగుచూసింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న షేక్ ఫరాజ్ (14) అనే విద్యార్థిని ప్రమాదవశాత్తు వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో విద్యార్ధి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. వారికి మజ్లిస్ పార్టీకి చెందిన నాయకులు, కార్పొరేటర్లు మద్దతు పలకడంతో జిల్లా అధికారులు వచ్చే వరకు రోడ్డుపై ఆందోళన నిర్వహించారు.
ఈ నిరసనలో మజ్లిస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఫహీమ్, డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్ పాల్గొన్నారు. దీంతో వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆందోళనకారులు ప్రమాదానికి కారణమైన లారీని ధ్వంసం చేశారు. నగరంలోకి భారీ వాహనాలను అనుమతించడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని, విద్యార్థి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సుమారు 2 గంటల పాటు నిరసన జరిగింది. మృతుడు ఆటోనగర్ చెందిన ప్రముఖ ఫంక్షన్ హల్ యజమాని రఫీక్ ఖాన్ తనయుడు అని, మృతుడు 8వ తరగతి చదువుతున్నట్లు తెలిసింది.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు వెనక్కి తగ్గారు.