- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గంజాయి కేసులో విద్యార్థికి జైలు
దిశ, క్రైమ్ బ్యూరో: గంజాయికి అలవాటు పడిన ఓ విద్యార్థికి ఇబ్రహీంపట్నం 15వ ఎంఎం కోర్టు 6 నెలల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించింది. వివరాల్లోకివెళితే.. కరీంనగర్ జిల్లాకు చెందిన సాయిని అరవింద్ దోమలగూడ ఏవీ కళాశాలలో లా చదువతున్నాడు. ఇతని వద్ద 2017 జూలై 17న 19.5 గ్రాముల గంజాయి ప్యాకెట్ పోలీసులకు దొరికింది. ఈ కేసును ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రస్తుతం హైదరాబాద్ సీసీఎస్ ఇన్ స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఆర్.గోవింద్ రెడ్డి నమోదు చేశారు. టీసీఆర్ ఆదిభట్ల సమీపంలో ఓఆర్ఆర్ వద్ద కారును ఆపి తనిఖీలు నిర్వహిస్తుండగా అతని వద్ద గంజాయి లభ్యమైంది. ఆ సమయంలో టీఎస్ 02 వీటీఆర్ 4144 ఆల్టో కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాలు ఎక్కడవని ఆరా తీయగా దాన్ని సేవిస్తున్నట్టు విచారణలో ఆ విద్యార్థి అంగీకరించాడు.దీంతో అందుకు సాక్ష్యాలను ఇన్ స్పెక్టర్ కోర్టు ముందు ఉంచి, చార్జీషీట్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తు అనంతరం ఈ నెల 18న న్యాయమూర్తి అరవింద్‌కు 6 నెలల కఠిన కారాగారం, రూ.5 వేల జరిమానా విధించారు. ఈ సందర్భంగా రాచకొండ సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ..నగర శివార్లలో గంజాయి సేవిస్తున్న యువకుల బృందంపై పోలీసుల నిఘా ఉందని, ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పిల్లలు అడిక్ట్ కాకుండా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని సీపీ కోరారు.