దేశంలో కఠిన లాక్‌డౌన్ అవసరం : రణదీప్ గులేరియా

by Shamantha N |
randeep guleria
X

న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్‌ను కట్టడి చేయాలంటే గతేడాది తరహాలోనే పాజిటివిటీ రేటు 10 శాతానికి మించి ఉన్న ప్రాంతాల్లో కఠిన లాక్‌డౌన్ విధించాల్సిన అవసరముందని ఎయిమ్స్ చీఫ్, కొవిడ్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు డాక్టర్ రణదీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. టీకాలు రావడం, హెర్డ్ ఇమ్యూనిటీ వార్తల నేపథ్యంలో ఫస్ట్ వేవ్ తర్వాత అందరిలోనూ కొవిడ్ నిబంధనలపై నిర్లక్ష్యం కనిపించిందని, అందుకే ఈ స్థాయిలో కేసులు పెరుగుతున్నాయని తెలిపారు.

ఈ స్థాయిలో కొత్త కేసులు ఏ దేశంలోనూ రాలేవని, ఏ దేశ ఆరోగ్య వ్యవస్థకైనా ఇది కఠిన సవాల్ అని వివరించారు. భారీగా కొత్త కేసులు వస్తుండటంతో హాస్పిటళ్లలో బెడ్ల కొరత, చికిత్సనందించడానికి వైద్యులకూ సమయం, శక్తిసామర్థ్యాలు చాలడం లేదని చెప్పారు. నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్‌డౌన్‌లు సత్ఫలితాలనివ్వడం లేదని తేలిపోతున్నదని, అందుకే అత్యధిక కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో కఠిన లాక్‌డౌన్ విధించాల్సిన అవసరముందని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed