- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రకాశం జిల్లాలో జంబలకడిపంబ
దిశ,వెబ్‌డెస్క్ : ఒక్కో ప్రదేశంలో ఒక్కో రకమైన ఆచార సాంప్రదాయాలు ఉంటాయి. అలాగే ప్రకాశం జిల్లాలో కూడా ఓ వింత ఆచారం ఉంది. ఆ జిల్లాలోని గుమ్మా వారి ఇంట్లో పెళ్లి అంటే అందరికీ జంబలకడిపంబ సినిమానే గుర్తొస్తుంది. వారి ఆచారంలో మగవాళ్లు చీర కట్టుకోవాల్సిందే, ఆడవాళ్లు లాల్చీ పైజామా వేసుకోవాల్సిందే.. లేదంటే అక్కడి ఆచారం ఒప్పుకోదు.
ప్రకాశం జిల్లా పెద్దారువీడు మండలం బీచెర్లపల్లి గ్రామంలో గుమ్మా ఆవులయ్య కుమారుడు అంకయ్య, అరుణల వివాహం జరిగింది. వివాహం అనంతరం వారు అంకాలమ్మ, పోలేరమ్మ దేవతలకు పూజలు చేసి అబ్బాయి అమ్మాయిలా, అమ్మాయి అబ్బాయిలా వేషం వేసుకుంటారు. అనంతరం తప్పట్లు తాళాలతో గ్రామ శివారులో ఉన్న జమ్మి చెట్టు, నాగుల పుట్టకు పూజలు నిర్వహిస్తారు. పట్టు చీరలో అబ్బాయి, పట్టు పంచెలో అమ్మాయి వేషధారణతో ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే గుమ్మా ఇంటి పేరు ఉన్న వారు ఈ ఆచారాలు పాటిస్తారని అక్కడి వారు చెబుతున్నారు. వీరితో పాటు ఈ పూజ చేయడానికి వారి కుటుంబ సభ్యులు, బంధువులు కూడా వెళ్తుంటారు.