ధాన్యం నిల్వ చేసేందుకు స్టోరేజీలు: మంత్రి పువ్వాడ అజయ్

by Sridhar Babu |
ధాన్యం నిల్వ చేసేందుకు స్టోరేజీలు: మంత్రి పువ్వాడ అజయ్
X

దిశ‌, ఖ‌మ్మం: రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి జిల్లావ్యాప్తంగా తగినన్ని స్టోరేజీలను ఏర్పాటు చేస్తామ‌ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. గురువారం ఖ‌మ్మం జిల్లా ముదిగొండలోని ఉషశ్రీ జిన్నింగ్ మిల్, నేలకొండపల్లిలోని మధుకాన్‌ షుగర్‌ ఫ్యాక్టరీలో ధాన్యం నిల్వ కేంద్రాలను మంత్రి పరిశీలించారు. ప్రభుత్వ గోదాంల‌తోపాటు ప్రైవేట్ సంస్థల నిల్వ‌ కేంద్రాల‌ను కూడా వినియోగించనున్నట్లు తెలిపారు. ఉషశ్రీ జిన్నింగ్ మిల్స్‌లో 4,500 మెట్రిక్ టన్నులు, మధుకాన్ షుగర్స్‌లో 7,500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని స్టోరేజ్ చేయ‌నున్న‌ట్లు చెప్పారు. లారీల కొరత వల్ల ధాన్యం తరలింపునకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన గుర్తు చేశారు. గ్రామాల్లో ఉన్న లోకల్ ట్రాక్టర్లను, లారీలను గుర్తించి వాటిని వినియోగించుకోవాలని మంత్రి అజయ్ సూచించారు. వివిధ కారణాలతో రైతులను ఇబ్బంది పెడుతున్న రైస్ మిల్లర్ల పై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి అజయ్ కుమార్ తెలియజేశారు.

tag:minister puvvada ajay, inspection, Storage, stored grain, khammam



Next Story

Most Viewed