- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్టిరిన్ గ్యాస్ చాలా ప్రమాదకరం.. నాడీ వ్యవస్థపై ప్రభావం
దిశ ఏపీ బ్యూరో: విశాఖపట్టణంలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదవశాత్తూ స్టిరిన్ గ్యాస్ లీకైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 25 అంబులెన్స్‌ల ద్వారా 300 మందిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రులకు వైద్యమందిస్తున్నారు. కలెక్టర్, పోలీస్ కమిషనర్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
80 మంది పరిస్థితి తీవ్రంగా ఉండడంతో వారంద్నీ వెంటిలేటర్‌పై ఉంచి, చికిత్సనందిస్తున్నారు. స్టిరిన్ గ్యాస్ చాలా ప్రమాదకరమైనదని నిపుణులు చెబుతున్నారు. ఈ గ్యాస్ గాలిలో 45 నిమిషాలు ఉంటే ప్రాణాలు హరిస్తుందని వారు తెలిపారు. దీనిని కేవలం 10 నిమిషాలు పీలిస్తే ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాల్సిందేనని అంటున్నారు. అయితే ఎల్జీ పాలిమర్స్‌లో లీకైన్ గ్యాస్ స్వల్ప మొత్తంలోనే లీకైందని, వెంటనే అప్రమత్తమైన సిబ్బంది లీకేజీని అరికట్టారని అధికారులు చెబుతున్నారు.
అయితే ఈ గ్యాస్ పీల్చి గాయపడ్డవారందిరీ దీర్ఘకాల సమస్యలు వేధించే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఈ వాయువు నాడీ మండలంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, తద్వారా దుష్పరిణామాలు సంభవించే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. క్షతగాత్రులకు అత్యాధునిక వైద్య చికిత్స అందిస్తున్నారు.
Tags: ap, lg polymers accident, stirin gas, gas leak accident, vizag, rr venkatapuram