- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జో రూట్ పై ఈసీబీ వేటు
దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ జట్టు టెస్ట్ కెప్టెన్ జో రూట్‌పై ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) వేటు వేయడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. విండీస్, పాకిస్తాన్ జట్లపై టెస్ట్ సిరీస్ (Test series)లు గెలిపించిన రూట్‌ను ఆస్ట్రేలియాతో జరగాల్సిన టీ20 సిరీస్ (T20 series) నుంచి తప్పించింది. మంగళవారం ఈసీబీ (ECB) ఆస్ట్రేలియాతో తలపడే ఇంగ్లాండ్ జట్టును ప్రకటించింది. వన్డేల్లో అతడిని ఎంపిక చేసినా టీ20 జట్టు నుంచి మాత్రం వేటు వేసింది.
మూడు ఫార్మాట్లలో స్టార్ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్న రూట్‌ను తప్పించడం ఏకంగా ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్‌ను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. మరోవైపు బెన్ స్టోక్స్, జాసన్ రాయ్‌కూడా జట్టులో స్థానం దక్కించుకోలేదు. దీనిపై స్మిత్ స్పందిస్తూ..’టీ20 జట్టులో జో రూట్ స్థానం గల్లంతు కావడం తనను చాలా ఆశ్చర్యపరిచింది. బహుశా దూకుడుగా ఉండే ఆటగాళ్లనే జట్టులోకి ఎంపిక చేశారేమో. అందరూ ఒకేలా ఆడితే అది క్రికెట్ ఎందుకు అవుతుంది. ఎవరి గేమ్ ప్లాన్ వాళ్లకు ఉంటుంది కదా. జో రూట్‌ను తప్పించడం నిజంగా తప్పే’ అని స్మిత్ వ్యాఖ్యానించాడు. ఇంగ్లాండ్ జట్టును టెస్టు ఫార్మాట్ (Test format)లో జో రూట్ నేతృత్వం వహిస్తుండగా, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం ఇయాన్ మోర్గాన్ నాయకత్వం వహిస్తున్నాడు.