ఆ నిబంధనలను సడలించొద్దు: కేంద్రం

by vinod kumar |
ఆ నిబంధనలను సడలించొద్దు: కేంద్రం
X

న్యూఢిల్లీ: నేటి నుంచి అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్ 4.0 నిబంధనల్లో అనేక సడలింపులనిచ్చామని, వీటికి అదనంగా మరిన్ని మినహాయింపులివ్వరాదని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. అవసరమైతే.. అక్కడి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మరికొన్ని ఆంక్షలు విధించే అధికారాన్ని ఇచ్చినట్టు వివరించింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా.. సోమవారం ఈ లేఖ రాశారు. ఇదివరకే చెప్పినట్టు లాక్‌డౌన్ 4.0 నిబంధనలను సడలించరాదని, అవసరాల మేరకు కొన్ని సేవలను రద్దు చేసుకునే వెసులుబాటు మాత్రమే రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉన్నదని ఆయన పేర్కొన్నారు. కంటైన్‌మెంట్ జోన్‌లు, బఫర్ జోన్‌లలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటేనే వైరస్‌ను ఓడించగలమని తెలిపారు. రెడ్, ఆరెంజ్, గ్రీన్ ఆరెంజ్ జోన్‌లను నిర్ణయించడానికి సంబంధించిన అధికారాలను రాష్ట్రాలకే అప్పజెప్పిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed