- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘భీముని పాదం’ లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్..

X
దిశ, గూడూరు : గూడూరు మండలం లోని సీతానగరం శివారులో భీముని పాదం జలపాతం ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయల్ సందర్శించారు. వారికి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ పి గౌతమ్, జిల్లా అటవి శాఖ అధికారి రవికిరణ్ లు స్వాగతం పలికారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మహబూబాబాద్ కు వెళుతూ మార్గమధ్యంలో గూడూరు శివారు లోని అడవిలో జాలువారుతున్న భీముని పాదం జలపాతం ను సందర్శించారు. దూర ప్రాంతాల నుండి వాటి అందాలను చూసేందుకు పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉన్నారు. సెలవుదినాల్లో అయితే మరింత ఎక్కువ రద్దీగా ఉంటుంది ఈ జలపాతం. కమిషనర్ వెంట మహబూబాబాద్ కలెక్టర్ పి గౌతమ్, డీయఫ్ఓ రవికిరణ్, గూడూరు తహసిల్దార్ శైలజ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామ్మూర్తి, మండల అదికారులు పాల్గొన్నారు.
Next Story