- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టార్ ఇండియా టార్గెట్ రూ. 3200 కోట్లు
దిశ, స్పోర్ట్స్ : బీసీసీఐకే కాకుండా బ్రాడ్‌కాస్టర్ స్టార్ ఇండియాకు కూడా భారీ లాభాలను తెచ్చిపెట్టేది ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాత్రమే. ఈ ఏడాది నిర్వహించనున్న ఐపీఎల్ 14వ సీజన్‌తో బ్రాడ్‌కాస్టర్‌గా స్టార్ ఇండియా ఒప్పందం ముగిసిపోనున్నది. ఆ తర్వాత కాంట్రాక్టు లభిస్తుందో లేదో ఇప్పుడే తెలియదు. అందుకే సాధ్యమైనంతగా ఈ సీజన్‌లోనే సంపాదించాలని స్టార్ ఇండియా టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం. ఐపీఎల్ 14వ సీజన్ ద్వారా రూ. 3200 కోట్లు యాడ్ల రూపంలో అర్జించడానికి స్టార్ ఇండియా ప్రణాళికలు సిద్దం చేసినట్లు మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
ఇప్పటికే జస్ట్ డయల్, బైజూస్, డ్రీమ్ 11, ఐటీసీ, ఎంఆర్ఎఫ్, ఫోన్‌పే, కోకాకోలా, గ్రూవ్, ఎయిర్‌టెల్ వంటి బడా కార్పొరేట్లతో స్టార్ ఇండియా ఒప్పందం కుదుర్చుకున్నది. గత ఏడాది 10 సెకెన్ల యాడ్‌కు రూ. 11 లక్షల నుంచి రూ. 11.50 లక్షలు వసూలు చేసింది. ఈ సారి యాడ్ రేట్లను 23 శాతం పెంచాలని స్టార్ నిర్ణయించింది. గత ఏడాది ఐపీఎల్ ద్వారా రూ. 2500 కోట్లు వరకు ఆదాయం అర్జించింది.