డిజిటల్ దునియా.. హీరోయిన్ల చూపు అటు వైపే!

by Jakkula Samataha |
డిజిటల్ దునియా.. హీరోయిన్ల చూపు అటు వైపే!
X

దిశ, సినిమా : దేశవ్యాప్తంగా నెలకొన్న కొవిడ్ విపత్కర పరిస్థితులు, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంపైనా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. పలు ఆంక్షల నడుమ థియేటర్స్ మూసివేస్తున్నందున ప్రజలు మళ్లీ ఓటీటీల వైపు మొగ్గు చూపుతున్నారు. థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైన సినిమాలు కూడా నెలరోజుల్లోనే ఓటీటీ బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మున్ముందు డిజిటల్ దునియానే కొనసాగుతుందని నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలో పలువురు స్టార్లు తమ సినిమాలను ఓటీటీల్లో విడుదల చేయాలనుకుంటున్నారు.

తాజాగా స్మైలింగ్ క్వీన్ త్రిష ల్యాండ్ మార్క్ మూవీ ‘పరమపాదం విలయట్టు’ డిస్నీ హాట్‌స్టార్ వేదికగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా త్రిషకు 60వ చిత్రం కాగా, ఆమె నటిస్తున్న నెక్స్ట్ మూవీ ‘రాంగి’ కూడా హాట్ స్టార్‌లోనే రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాకు ఏ.ఆర్ మురుగదాస్ కథ అందించగా, ‘జర్నీ’ ఫేమ్ శరవణన్ దర్శకత్వం వహించారు. ఇక లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న మిస్టరీ థ్రిల్లర్ ‘నెట్రికాన్’ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. కొరియన్ చిత్రం ‘బ్లైండ్’కు ఇది రీమేక్ కాగా, ఇందులో ప్రతీకారం తీర్చుకునే అంధ మహిళగా నయనతార కనిపించనున్నారు. నయనతార, విఘ్నేష్ శివన్‌కు చెందిన రౌడీ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించగా.. ‘అవల్’ ఫేమ్ మిలింద్ రౌ డైరెక్టర్. వీరితో పాటు పలువురు కోలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఓటీటీ వైపే మొగ్గుచూపుతున్నారు.

Advertisement

Next Story