సుమక్కతో.. శ్రీముఖి!

by Jakkula Samataha |
సుమక్కతో.. శ్రీముఖి!
X

దిశ, వెబ్‌డెస్క్ : బుల్లితెర రాములమ్మగా తిరుగులేని పాపులారిటీ దక్కించుకున్న యాంకర్‌ ‘శ్రీముఖి’.. బిగ్ బాస్ షో ద్వారా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. అటు సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ పటాస్ యాంకర్.. అక్కడ అంతగా క్లిక్ కాలేదనే చెప్పాలి. అయితేనేం.. వెండి తెర ఇవ్వలేని నేమ్, ఫేమ్‌ను బుల్లితెరపై సంపాదించి ది బెస్ట్ యాంకర్‌గా దూసుకుపోతోంది. అయితే, కొంత కాలంగా టీవీల్లో కనిపించని శ్రీముఖి.. తాజాగా ‘ఓ ఉమెనియా’ అంటూ.. యూట్యూబ్‌లో ఓ ప్రోమోతో మన ముందుకొచ్చింది. ఈ షో పేరు చూస్తేనే.. ఇది మహిళలకు సంబంధించిన ప్రొగ్రామ్ అని తెలుస్తోంది. కాగా, ఈ ప్రోమోకు వన్ మిలియన్ వ్యూస్‌ కట్టబెట్టి, శ్రీముఖి షోకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు నెటిజన్లు. ఈ క్రమంలోనే తెలుగు యాంకర్లందరికీ స్ఫూర్తిగా చెప్పుకునే ‘సుమ’తో తొలి షో స్టార్ట్ చేసింది శ్రీముఖి.

యాక్టర్స్‌లోనే ‘సూపర్ స్టార్స్, క్వీన్స్’ ఉంటారని అనుకునే తరుణంలో.. యాంకరింగ్ ఫీల్డ్‌లోనూ అలాంటి స్టాండర్డ్స్‌ను మనం బిల్డ్ చేయొచ్చని.. కేవలం ‘సుమ’తోనే ఇలా జరిగిందని చెబుతూ.. సుమక్కతో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసింది శ్రీముఖి. లాక్‌డౌన్‌లో.. టెలివిజన్ యాంకరింగ్ క్వీన్ సుమ చేసిన పలు యూట్యూబ్ వీడియోలను చూసి ఇన్‌స్పైర్ అయిన శ్రీముఖి.. ఓ కొత్త కాన్సెప్టుతో కూడిన ప్రోగ్రాంతో అభిమానుల ముందుకొచ్చినట్లు తెలిపింది. ఈ షోలో వీరిద్దరూ నవ్వులు పూయించినట్టు ప్రోమోలో తెలస్తుండగా.. ‘విష్పర్ చాలెంజ్, జిగురు జింగానియా’ అనే రెండు రౌండ్లతో శ్రీముఖి ఈ షోను డిజైన్ చేసింది. ఇక ఈ షోకు వచ్చిన గెస్ట్ ఈ షో గురించి, శ్రీముఖి గురించి ఏమనుకుంటున్నారో చీటీల్లో రాసి ఇవ్వాలని చెప్పిన శ్రీముఖి.. మొదటి సీజన్‌లో వచ్చిన గెస్ట్‌లు అందరూ ఏమనుకున్నారో.. లాస్ట్‌లో చదువుతానని వెల్లడించింది. మరి శ్రీముఖి కొత్తగా ట్రై చేస్తున్న ఈ షో ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూద్దాం.

Advertisement

Next Story