- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తొలి టెస్టులో వెస్టిండీస్‌పై శ్రీలంక విజయం
దిశ, స్పోర్ట్స్: గాలే వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక 187 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 386 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 230 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో శ్రీలంకకు తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగుల ఆధిక్యత లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 191/4 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. 348 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు నాలుగో రోజు కేవలం 52 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఇక ఐదో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ నిలకడగా ఆడింది. తొలి సెషన్‌లో ఒక వికెట్ కోల్పోయి 73 పరుగులు జోడించారు. లంచ్ విరామం తర్వాత వెస్టిండీస్ జట్టు పెద్దగా పరుగులు జోడించలేదు. మరో 25 పరుగులు జోడించిన అనంతరం వెస్టిండీస్ జట్టు 150 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో వెస్టిండీస్‌పై శ్రీలంక 187 తేడాతో గెలిచింది. వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ కూల్చడంలో శ్రీలంక స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారు. లసిత్ ఎంబుల్దనియా 5 వికెట్లతో చెలరేగిపోగా.. రమేష్ మెండిస్ 4 వికెట్లు తీశాడు. సెంచరీతో అదరగొట్టిన శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
- Tags
- 1st test