పంచాయతీల్లో హైపో క్లోరైట్ ద్రావణం పిచికారి

by vinod kumar |   ( Updated:2020-04-09 05:46:14.0  )

దిశ, న‌ల్ల‌గొండ‌: జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా అన్ని గ్రామ పంచాయతీల్లో సోడియం హైప్రో క్లోరైట్ ద్రావణం ఇప్పటికీ మూడుసార్లు పిచికారి చేయించామని సూర్య‌పేట‌ జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇంకా మెరుగైన చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ముఖ్యంగా లాక్‌డౌన్ ఉన్నందున ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ 50 కిలోల సోడియం హై ప్రో క్లోరైట్, 50 కిలోల క్లోరైడ్ గులికలు, ఒక తైవాన్ స్పేయర్ వినియోగిస్తున్నట్లు తెలిపారు. కంటైన్మెంట్ ఉన్న ప్రాంతాల్లో ప్రతి రోజు పిచికారి చేస్తున్నామన్నారు. సమాజ హితం కోసం ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రతి ఒక్కరూ పాటించాలని, అనవసరంగా అధైర్య పడొద్దని, కరోనా సోకకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ తెలిపారు.

Tags : Spray, hypochloride solution, panchayats, nalgonda, corona virus

Advertisement

Next Story

Most Viewed