గొప్ప ఫుట్‌బాలర్‌ని నేనే

by John Kora |
గొప్ప ఫుట్‌బాలర్‌ని నేనే
X

- మీకు ఎవరైనా నచ్చొచ్చు.. కానీ నేనే గ్రేట్

- గోట్ చర్చకు తెరదింపిన రొనాల్డో

దిశ, స్పోర్ట్స్: ఫుట్‌బాల్ క్రీడలో గొప్ప ఆటగాడిని నేనే అని క్రిస్టియానో రొనాల్డో చెప్పాడు. గత కొంత కాలంగా ఫుట్‌బాల్‌లో అందరి కంటే గొప్ప ప్లేయర్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం -గోట్) ఎవరు అనే చర్చ జరుగుతోంది. అయితే లియోనీ మెస్సీ, డిగో మరడోనా, పీలేల కంటే తానే 'గోట్ ప్లేయర్'ని అని రొనాల్డో ప్రకటించుకున్నాడు. రొనాల్డో తన కెరీర్‌లో ఐదు బాలెన్‌డీ అవార్డులను, మరెన్నో గొప్ప పురస్కారాలను పొందాడు. రొనాల్డో పేరిట ఎన్నో రికార్డులు నమోదై ఉన్నాయి. మరోవైపు మెస్సీ ఎనిమిది గోల్డెన్ బాల్స్ గెలుచుకోగా.. పీలే, మరడోనాలు అభిమానుల చేత 'గోట్ ప్లేయర్స్' అని కీర్తించబడ్డారు. కొంత కాలంగా ఫుట్‌బాల్‌లో అత్యుత్తమ ప్లేయర్ అనే చర్చ జరుగుతోంది. ఇదే విషయాన్ని ఒక టీవీ ఇంటర్వ్యూలో రొనాల్డోని ప్రశ్నించగా.. తానే అని సమాధానం ఇచ్చాడు. ఇప్పటి వరకు ఫుట్‌బాల్ చరిత్రలో తన లాంటి ప్లేయర్ రాలేదని చెప్పాడు. ఇది నా అభిప్రాయమని.. ఇది అభిరుచికి సంబంధించిన విషయమని రొనాల్డో పేర్కొన్నాడు. ఇతరుల అభిరుచి వేరేలా ఉండొచ్చు.. వారికి వేరే ప్లేయర్లు గొప్ప వాళ్లుగా అనిపించొచ్చు. కానీ నా మటుకు నేను మాత్రమే గొప్ప ప్లేయర్‌ని అని స్పష్టం చేశాడు. ఫుట్‌బాల్ కోసం తాను చేయాల్సిందంతా చేశానని రొనాల్డో చెప్పుకొచ్చాడు. మీకు మెస్సీ, పీలే, మరడొనా నచ్చవచ్చు. కొంత మంది దీని గురించి మాట్లాడుతుండగా నేను కూడా విన్నాను. వారి అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. కానీ క్రిస్టియానో కంప్లీట్ ప్లేయర్ కాదు అన్నది మాత్రం అబద్దం. నేను పూర్తి స్థాయి ఆటగాడిని.. నా కంటే ఉత్తమమైన ఆటగాడిని నేను చూడలేదు.. ఇది నేను మనస్పూర్తిగా చెప్తున్నానని రొనాల్డో వెల్లడించాడు.

Advertisement
Next Story

Most Viewed