- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జైశ్వాల్‌కు ఆ విషయంలో కీలక సూచన చేసిన అనిల్ కుంబ్లే
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా యువ సంచలనం యశస్వి జైశ్వాల్‌కు భారత మాజీ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే కీలక సూచన చేశాడు. ఆదివారం ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు సందర్భంగా జియో సినిమాతో మాట్లాడిన కుంబ్లే.. డబుల్ సెంచరీ బాదిన జైశ్వాల్‌ను అభినందించాడు. అలాగే, లెగ్ స్పిన్‌ను వదులుకోవద్దని సూచించాడు. ‘అద్భుతంగా బ్యాటింగ్ చేశావు. జైశ్వాల్ నువ్వు సహజమైన లెగ్ స్పిన్ వేయగలవు. కాబట్టి, నీవు దాన్ని కొనసాగించాలని చెప్పాలనుకుంటున్నా. దాన్ని వదలిపెట్టకు. లెగ్ స్పిన్ ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పలేం. నువ్వు వెన్నుముకతో బాధపడుతున్నావని తెలుసు. కానీ, నువ్వు లెగ్ స్పిన్‌పై ప్రాక్టీస్ చేస్తుంటే మాత్రం నేను కొన్ని ఓవర్లు వేస్తానని కెప్టెన్‌ను అడుగు.’ అని కుంబ్లే చెప్పుకొచ్చాడు. మూడో టెస్టు ముగిసిన తర్వాత జైశ్వాల్ మాట్లాడుతూ.. కుంబ్లే సూచనను అంగీకరించాడు. కెప్టెన్ రోహిత్ కూడా తనను సిద్ధంగా ఉండాలని చెప్పాడని, తాను సిద్ధంగా ఉన్నాని తెలిపాడు. కాగా, లిస్టు ఏ క్రికెట్‌లో జైశ్వాల్ 7 వికెట్లు పడగొట్టాడు.