WTC Final మ్యాచ్‌కు అశ్విన్ డౌట్.. కారణం చెప్పిన ఆసీస్ కోచ్

by Vinod kumar |
WTC Final మ్యాచ్‌కు అశ్విన్ డౌట్.. కారణం చెప్పిన ఆసీస్ కోచ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా జట్టుతో జూన్ 7 నుంచి ప్రారంభంకానున్న ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆడటం సందేహమేనని ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ డేనియల్ వెటోరీ వెల్లడించారు. పేస్‌కి అనుకూలించే ఓవల్ పిచ్‌పై ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలా.. లేదా నలుగురు పేసర్లతో తుది జట్టుని ఎంపిక చేయాలా.. అనే సందిగ్ధంలో టీమిండియా ఉంది.

భారత్ తుది జట్టు ఎంపిక గురించి ఆస్ట్రేలియా టీమ్‌లోనూ చర్చ జరిగినట్లు అంగీకరించిన డేనియల్ వెటోరీ.. రవీంద్ర జడేజాని బ్యాటింగ్‌ కోసం కచ్చితంగా కొనసాగిస్తారని స్పష్టం చేశాడు. జడేజా నెం.6లో టెస్టుల్లో బ్యాటింగ్ చేస్తుంటాడు. దాంతో ఇప్పుడు పోటీ శార్ధూల్ ఠాకూర్, అశ్విన్ మధ్యే ఉండబోతోందని.. కాబట్టి.. టీమ్ కాంబినేషన్ కోసం అశ్విన్‌ని పక్కన పెట్టే అవకాశాలే ఎక్కువ అని వెటోరీ పేర్కొన్నారు. ఇంగ్లాండ్ గడ్డపై కేవలం ముగ్గురు పేసర్లతో దిగే సాహసం చేయకపోవచ్చు. దాంతో భారత్ తుది జట్టుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇండియా ముగ్గురు పేసర్‌లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగే అవకాశం ఉందని తెలిపారు. నాలుగో పేసర్‌గా శార్దూల్‌కు అవకాశం రావోచ్చని వెటోరి అభిప్రాయపడ్డాడు.

Advertisement

Next Story

Most Viewed