Paris olympics : ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం.. కాంస్యం సాధించిన రెజ్లర్ అమన్

by Harish |
Paris olympics : ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం.. కాంస్యం సాధించిన రెజ్లర్ అమన్
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. రెజ్లర్ అమన్ సెహ్రావత్ కాంస్య పతకం కొల్లగొట్టాడు. పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల కేటగిరీలో అతను పతకం సాధించాడు. బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో అమన్ 13-5 తేడాతో ప్యూర్టో రికో‌కు చెందిన డారియన్ క్రజ్‌ను మట్టికరిపించాడు. ఆరంభంలో 3-2తో కాస్త వెనుకబడిన అమన్ ఆ తర్వాత బలంగా పుంజుకున్నాడు. అతని ముందు ప్రత్యర్థి నిలువలేకపోయాడు. చివరి వరకూ ఆధిపత్యం ప్రదర్శించి కాంస్యం కైవసం చేసుకున్నాడు. ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది 6వ పతకం. రెజ్లింగ్‌లో ఇదే తొలి మెడల్.

Advertisement

Next Story

Most Viewed