- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతని స్ఫూర్తితోనే విజయం.. పాక్‌పై మెరుపు ఇన్నింగ్స్ ఆడిన జెమిమా రోడ్రిగ్స్
న్యూఢిల్లీ: ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా శుభారంభం చేసిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో జెమిమా రోడ్రిగ్స్ మెరుపు ఇన్నింగ్స్‌తో కీలక ఇన్నింగ్స్ ఆడింది. 38 బంతుల్లో 53 పరుగుల అజేయంగా నిలిచి జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. మ్యాచ్ అనంతరం జెమిమా రోడ్రిగ్స్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ స్ఫూర్తితోనే ఈ విజయం సాధించామని తెలిపింది.
'ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య మ్యాచ్ ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. ఆ మ్యాచ్‌లు చూస్తే పెరిగాం. గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో కోహ్లీ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. దాని గురించి మేము మాట్లాడుకుంటాం. మేము కూడా అలాంటి విజయాన్ని సాధించాలనుకున్నాం. అలాంటి తీవ్రతతోనే మేము ఆడాలనుకున్నాం' అని రోడ్రిగ్స్ తెలిపింది. కాగా, గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో పాక్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు విజయాన్ని కట్టబెట్టిన విషయం తెలిసిందే.
Also Read..