కోహ్లీని ఎందుకు ఐకాన్‌గా పిలుస్తారు?. పాక్ మాజీ కెప్టెన్ ఏం చెప్పాడంటే?

by Harish |
కోహ్లీని ఎందుకు ఐకాన్‌గా పిలుస్తారు?. పాక్ మాజీ కెప్టెన్ ఏం చెప్పాడంటే?
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ ప్రశంసలు కురిపించాడు. బ్యాటింగ్‌లోనే‌ కాకుండా ఫిట్‌నెస్‌లోనూ కోహ్లీ తన ప్రమాణాలను నిర్దేశించాడన్నాడు. అతను ప్రపంచంలోనే నం.1 అథ్లెట్ అని కొనియాడాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో హఫీజ్ మాట్లాడుతూ.. ‘కోహ్లీ చాలా ఫిట్‌గా ఉంటాడు. అందుకే ఎంత ఒత్తిడిని ఉన్నా దాన్ని అధిగమిస్తాడు. 10 ఏళ్లలో అతనిలా ఫిట్‌నెస్ ఉన్న ఒక్క ఆటగాడి పేరు చెప్పండి. భారత్‌లోనే కాదు.. ప్రపంచంలోనే అతను నం.1. అందుకు కారణం అతని ఫిట్‌నెస్. అతను ప్రతి గేమ్‌ను అత్యుత్తమ అథ్లెట్లలో ఒకరిగా ఆడాలనుకుంటాడు. ఎవరు వదిలివెళ్లని వారసత్వాన్ని వదిలేయాలని భావిస్తాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో, వరల్డ్‌లో అతన్ని అందుకే ఐకాన్‌గా భావిస్తారు.’ అని తెలిపాడు. ఆ వీడియోను హఫీజ్ తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఆ పోస్టుకు ‘క్రికెట్ ఐకాన్ ఫర్ రీజన్ విరాట్ కోహ్లీ’అని రాసుకొచ్చాడు.

Advertisement

Next Story