- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'హిట్‌మ్యాన్ అప్పుడు దిగి ఉంటే టీమిండియా మ్యాచ్ గెలిచేది'
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌లో టీమిండియా పేలవ ప్రదర్శన చేసింది. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో బంగ్లా సిరీస్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలో టీమిండియా బౌలింగ్, బ్యాటింగ్ ప్రదర్శనపై విమర్శలు ఎదుర్కొంటుండగా.. సునీల్ గవాస్కర్ స్పందించాడు. టీమిండియా ఇన్నింగ్స్‌లో ఇంత ఆలస్యంగా బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ నిర్ణయాన్ని సునీల్ గవాస్కర్ ప్రశ్నించాడు.
రోహిత్ బొటనవేలు గాయం కారణంగా నెం.9 స్థానంలో బ్యాటింగ్ చేసి.. 28 బంతుల్లో 51 పరుగులు చేశాడు. అయితే 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జట్టు 5 పరుగులకే ఓటమిపాలైంది. కాగా అతను 9వ స్థానంలో కాకుండా 7వ స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి ఉండేదని అభిప్రాయపడ్డాడు. రోహిత్ అవతలి ఎండ్‌లో ఉంటే అక్షర్ పటేల్ మరింత తెలివిగా ఆడేవాడని, వాళ్ల ఇద్దరి మధ్య మంచి భాగస్వామ్యానికి అవకాశం ఉండేదని తెలిపాడు. ఆ తర్వాత భారత బ్యాటింగ్ లైపప్‌లో శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్‌ల కూడా ఉన్నారని అన్నాడు. రోహిత్ ఇంతకు ముందు వచ్చి ఉంటే టీమిండియా గెలిచే అవకాశం ఉండేదని రోహిత్ చెప్పుకొచ్చాడు.