బిగ్ ప్లేయర్‌కు, ఆవరేజ్‌ ప్లేయర్‌కు ఉన్న తేడా అదే : శుభ్‌మన్ గిల్

by Harish |
బిగ్ ప్లేయర్‌కు, ఆవరేజ్‌ ప్లేయర్‌కు ఉన్న తేడా అదే : శుభ్‌మన్ గిల్
X

దిశ, స్పోర్ట్స్ : మొదట్లో తనపై తనకు ఎలాంటి అంచనాలు ఉన్నాయో, ఇప్పుడూ అవే అంచనాలు ఉన్నాయని టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. రాంచీ టెస్టుకు ముందు బుధవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గిల్.. మూడో స్థానం, ఫామ్ వంటి విషయాల గురించి మాట్లాడాడు. ‘సొంత అంచనాలను కలిగి ఉండటం కాస్త కఠినమైంది. నాపై ఉన్న అంచనాల గురించి ఇతరులు మాట్లాడినప్పుడు నాకు పెద్ద తేడా ఏం ఉండదు. అయితే, సొంత అంచనాలు మాత్రం నన్ను కాస్త నిరాశపరిచాయి. జట్టు కోసం, దేశం కోసం ఎలా ఆడాలన్నదానిపై ఎవరికైనా అంచనాలు ఉంటాయి. అయితే, అవి నా ఆలోచన విధానాన్ని మార్చిందని అనుకోను. నాపై ఇప్పటికీ నాకు అదే అంచనాలు ఉన్నాయి. ఇదంతా వాటిని ఏ ఎలా మర్చిపోతున్నారు, త్వరగా ముందుకు వెళ్లడం, తర్వాతి సవాల్‌కు సిద్ధమవడంపై ఆధారపడి ఉంటుంది. ఒక బిగ్ ప్లేయర్‌కు, ఒక ఆవరేజ్ ప్లేయర్‌కు ఉన్న తేడా ఇదే.’ అని గిల్ తెలిపాడు. అలాగే, సుదీర్ఘ ఫార్మాట్‌లో నం.3 బ్యాటింగ్ పొజిషన్‌పై గిల్ స్పందిస్తూ.. తాను ఆ స్థానంలో బ్యాటింగ్ చేయడం కొత్తేం కాదన్నాడు. భారత ఏ జట్టు తరపున, రంజీ ట్రోఫీల్లో నం.3, నం.4 స్థానాల్లో బ్యాటింగ్ చేశానని చెప్పాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగితే కాస్త దూకుడుగా ఆడాల్సి ఉంటుందని, మిడిలార్డర్‌లో మాత్రం పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేయాలని తెలిపాడు. కాగా, కొంతకాలంగా టెస్టుల్లో నిరాశపరుస్తున్న గిల్.. వైజాగ్ టెస్టులో సెంచరీతో ఫామ్ అందుకున్నాడు. రాజ్‌కోట్ టెస్టులోనూ 91 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed