- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Rohit-Kohli: రోహిత్, కోహ్లీలలో పాకిస్థాన్‌పై ఎవరు తోపు? ఇండియన్ స్టార్స్ రికార్డులివే!

దిశ, వెబ్ డెస్క్: Rohit-Kohli: పాకిస్థాన్‌పై ఫిబ్రవరి 23న ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో అందరిచూపు రోహిత్, కోహ్లీపైనే ఉంది. పాక్‌పై ఈ ఇద్దరి ఆటగాళ్ల రికార్డులను ఒకసారి చూద్దాం!
రోహిత్, కోహ్లీ.. ఇద్దరూ క్రికెట్ వీరులే! ఒకరి కన్నా మరొకరు మెరుగ్గా రాణించాలనే పోటీతో పరుగుల వరద పారించిన వారే. కానీ కొంత కాలంగా కాస్త వెనుకబడ్డారు. ఫామ్ లేకపోవడం, వయసు ప్రభావం, కుర్రాళ్ల దూకుడు.. ఇవన్నీ కలిసి వీరిపై ఒత్తిడి పెంచాయి. 2023 వన్డే వరల్డ్ కప్, 2024 టీ20 వరల్డ్ కప్‌లలో వీరిద్దరూ మెరుపులు మెరిపించారు. ఇప్పుడు 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నద్ధమవుతున్న వీరికి, ఇది కొత్త ఊపునిచ్చే అవకాశం! ఇక 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఇండియాకు ఎదురైన ఘోర పరాజయాన్ని ఫ్యాన్స్ ఇంకా మరిచిపోలేదు. ఇప్పుడు అదే టోర్నమెంట్, అదే ప్రత్యర్థి! ఈసారి రోహిత్, కోహ్లీ ప్రతీకారం తీర్చుకుంటారా? పాకిస్తాన్‌పై వీరిలో ఎవరి రికార్డు బెస్ట్?
కోహ్లీ రికార్డులు ఇవే!
విరాట్ కోహ్లీ అంటేనే ఛేజ్ మాస్టర్! ప్రత్యేకించి పాకిస్తాన్‌పై మరింత రెచ్చిపోతాడు. 16 మ్యాచుల్లో 678 రన్స్ చేశాడు సగటు 52.15గా ఉంది. స్ట్రైక్ రేట్ 100కు పైగా ఉంది. 3 సెంచరీలు, 2 అర్ధశతకాలు ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్ 183గా ఉంది. 2012 ఆసియా కప్‌లో 330 పరుగుల ఛేజింగ్‌లో విరాట్ 183 పరుగులు చేసి, ఇండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. అది కోహ్లీ వన్డే కెరీర్‌లో ఇప్పటివరకు అతిపెద్ద స్కోర్!
రోహిత్ రికార్డులు ఇవే!
అటు పాకిస్తాన్‌పై రోహిత్ శర్మ రికార్డు కూడా గొప్పగానే ఉంది. విరాట్ కంటే తక్కువ సెంచరీలు ఉన్నా, రోహిత్ రికార్డు మరింత స్ట్రాంగ్‌గా ఉంది. 19 మ్యాచుల్లో 873 రన్స్ చేశాడు. సగటు 51.35గా ఉంది. 8 అర్ధశతకాలు, 1 సెంచరీ ఉన్నాయి. 2019 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై రోహిత్ 140 రన్స్ చేశాడు. ఇక రోహిత్, కోహ్లీ.. ఇద్దరూ ఈసారి పాకిస్తాన్‌పై ఎలా ఆడతారు? 2017 కప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటారా? లేక మళ్లీ వన్‌సైడ్ మ్యాచ్ అవుతుందా? కొన్ని గంటల్లో తేలిపోతుంది. ఇక ఈ ఇరు జట్లు ఒకే టోర్నీలో రెండుసార్లు తలపడితే ఆ కిక్కే వేరు కూడా. ఒకవేళ గ్రూప్ ఏ నుంచి భారత్, పాకిస్తాన్ సెమీ-ఫైనల్‌కు చేరుకుంటే. అక్కడ సెమీ-ఫైనల్స్‌లో గ్రూప్ బీ నుంచి అర్హత సాధించిన జట్లతో తలపడతాయి. అంటే సెమీ-ఫైనల్స్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడే ఛాన్స్ లేదు. అయితే, భారత్ వర్సెస్ పాకిస్తాన్ సెమీ-ఫైనల్స్ గెలిచి ఫైనల్‌లోకి ప్రవేశిస్తే, ఫైనల్ మ్యాచ్‌లో ఇరుజట్లు తలపడే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పటికి పాక్ ఒక మ్యాచ్ ఓడిపోయి ఉంది.. మరి చూడాలి ఏం జరుగుతుందో!