- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ధోనీ ఈజ్ బ్యాక్.. నెట్ ప్రాక్టీస్‌లో సిక్స్‌లతో అలరించిన మిస్టర్ కూల్

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023 కోసం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టిన ధోనీ.. నెట్స్‌లో తన మార్క్ సిక్స్‌లతో అలరించాడు. భారీ సిక్స్‌లు బాదాడు. ధోనీని ఎల్లో జెర్సీలో బహుశా చివరిసారి చూడబోతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్.. వచ్చే ఐపీఎల్ తర్వాత మిస్టర్ కూల్ ఈ మెగా లీగ్ నుంచి కూడా తప్పుకునే అవకాశాలు ఉన్నాయి. ఈసారి ఐపీఎల్ స్వదేశంలో జరుగుతుండటంతో చెన్నైలో సొంత ప్రేక్షకుల ముందు తన చివరి మ్యాచ్ ఆడబోతున్నాడు.
ఈసారి విజేతగా నిలిపి విజయవంతంగా తన కెరీర్ ముగించాలని ధోనీ భావిస్తున్నాడు. అంతేకాదు నెట్స్‌లో తన మార్క్ సిక్స్‌లు బాదుతూ కనిపించాడు. అతనికి స్పిన్నర్లు బౌలింగ్ చేస్తుండగా.. ధోనీ అవలీలగా వాటిని సిక్స్‌లుగా మలిచాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది. చాలా రోజుల తర్వాత ధోనీ మళ్లీ బ్యాట్ పట్టడం చూసి ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. 2008 నుంచి చెన్నైసూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా ధోనీ వ్యవహరిస్తున్నాడు. గతేడాది సీజన్ మొదట్లో జడేజాకు కెప్టెన్సీ అప్పగించాడు. అతడు విఫలం కావడంతో కెప్టెన్సీ మళ్లీ ధోనీ చేతికి వచ్చింది. ఇప్పటి వరకూ కెరీర్‌లో మొత్తం 234 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ధోనీ.. 4,978 రన్స్ చేశాడు. ఇందుల్లో 229 సిక్స్‌లు ఉన్నాయి.