సత్తా చాటిన Team India బౌలర్లు.. కుప్పకూలిన కివీస్

by GSrikanth |   ( Updated:2023-01-21 10:56:39.0  )
సత్తా చాటిన Team India బౌలర్లు.. కుప్పకూలిన కివీస్
X

దిశ, వెబ్‌డెస్క్: రాయ్‌పూర్ వేదికగా జరుగుతోన్న రెండో వన్డే మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగారు. 108 పరుగుల స్వల్ప స్కోరుకే న్యూజిలాండ్‌ను ఆలౌట్ చేశారు. కివీస్ బ్యాటర్లలో ఫిలిప్స్(36), సాంట్‌నర్(27), బ్రాస్‌వెల్(22) వంటి బ్యాటర్లు కనీస స్కోరు చేసి పెవీలియన్ చేరగా.. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు, హార్దిక్ పాండ్యా 2, వాసింగ్టన్ సుందర్ 2, సిరాజ్, కుల్దీప్, షార్దూల్ ఠాకూర్‌లు తలో వికెట్‌ తీసి అదరగొట్టారు. దీంతో టీమిండియా బ్యాటర్ల ఎదుట 109 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంది. మరి ఓపెనర్లే ఫినిష్ చేస్తారో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి : వన్డే చరిత్రలో తొలిసారి.. చరిత్ర సృష్టించిన భారత్..

Advertisement

Next Story

Most Viewed