PV Sindhu : సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టోర్నీ.. ఫైనల్‌కు సింధు

by Sathputhe Rajesh |
PV Sindhu : సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టోర్నీ.. ఫైనల్‌కు సింధు
X

దిశ, స్పోర్ట్స్ : సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్300 టోర్నీ ఫైనల్‌కు పీవీ సింధు దూసుకెళ్లింది. సెమీఫైనల్‌లో ఉన్నతి హుడాను సింధు వరుస సెట్లలో ఓడించింది. 36 నిమిషాల పాటు సాగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఉన్నతి హుడాపై 21-12, 21-9 తేడాతో సింధు గెలుపొందింది. థాయ్‌లాండ్‌కు చెందిన లలిన్‌రట్ చైవాన్, చైనాకు చెందిన లూయూవూ మధ్య మరో సెమీ ఫైనల్ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన క్రీడాకారిణితో సింధు ఫైనల్‌లో తలపడనుంది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ఐదో సీడ్ తనిషా క్రాస్టో, ధ్రువ్ కపిల సైతం ఫైనల్‌కు చేరుకున్నారు. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఈ ద్వయం చైనాకు చెందిన డూ జీ హాంగ్ జూ, జియా యీ యాంగ్‌లపై వరుస సెట్‌లలో గెలుపొంది తుదిపోరులో బెర్త్ కన్పార్మ్ చేసుకున్నారు. చైనాకు చెందిన పిన్ యీ లీయో- కె క్సిన్ హువాంగ్, థాయ్‌లాండ్‌కు చెందిన డెచాపొల్-సుపిస్సారా‌ల మధ్య జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన ఆటగాళ్లతో తుదిపోరులో ఈ భారత జోడీ తలపడనుంది.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed