- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూర్యకుమార్ యాదవ్

X
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ క్రికెటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ సతీసమేతంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు ఆయనకు దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సూర్యకుమార్ యాదవ్ దంపతులను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ క్రమంలో అభిమానులు, అక్కడున్న భక్తులు అతనితో స్పెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.
— Surya Kumar Yadav (@surya_14kumar) February 21, 2023
Next Story