టెస్టు ఫార్మాట్‌కు క్లాసెన్ వీడ్కోలు

by Swamyn |
టెస్టు ఫార్మాట్‌కు క్లాసెన్ వీడ్కోలు
X

దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు ఫార్మాట్‌కు సోమవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌పై ఫోకస్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. ‘రెడ్ బాల్ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నా. ఈ నిర్ణయం చాలా కఠినమైంది. ఎందుకుంటే, టెస్టు ఫార్మాట్ నా ఫేవరెట్. ఇది చాలా అద్భుతమైన ప్రయాణం. నా దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు గర్వపడుతున్నాను.’ అని క్లాసెన్ చెప్పాడు. పరిమిత ఓవర్లలో బిగ్ హిట్టర్‌గా గుర్తింపు పొందిన క్లాసెన్.. సుదీర్ఘ ఫార్మాట్‌లో మాత్రం ఎక్కువగా అవకాశాలు అందుకోలేకపోయాడు. 2019లో టెస్టు అరంగేట్రం చేసిన అతను కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడి 104 పరుగులు చేశాడు. గతేడాది మార్చిలో సొంతగడ్డపై వెస్టిండీస్‌తో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇటీవల భారత్‌తో సిరీస్‌కు కూడా అతన్ని పక్కనపెట్టారు. ఇక, క్లాసెన్ వన్డే, టీ20 మ్యాచ్‌లకే పరిమితం కానున్నాడు. ఇటీవల సీనియర్ ఓపెనర్ డీన్ ఎల్గర్ టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.


👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed