హెడ్ నన్ను దూషించాడు.. పైగా అబద్ధాలు చెప్పాడు : సిరాజ్

by Harish |
హెడ్ నన్ను దూషించాడు.. పైగా అబద్ధాలు చెప్పాడు : సిరాజ్
X

దిశ, స్పోర్ట్స్ : ఆసిస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ తనను దూషించాడని టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తెలిపాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య పింక్ బాల్ టెస్టులో రెండో రోజు సిరాజ్, హెడ్ మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. హెడ్‌ను అవుట్ చేసిన తర్వాత సిరాజ్ సంబరాలు చేసుకుంటూ పెవిలియన్‌కు వెళ్లాలని సైగ చేయగా.. హెడ్ ఏదో అనుకుంటూ వెళ్లాడు.

తాను బాగా బౌలింగ్ చేశావని మాత్రమే చెప్పానని, సిరాజ్ వేరేలా అర్థం చేసుకున్నాడని రెండో రోజు ఆట అనంతరం హెడ్ వ్యాఖ్యానించాడు. హెడ్ వ్యాఖ్యలపై సిరాజ్ స్పందించాడు. ఆదివారం మైదానంలో హర్భజన్ సింగ్‌తో మాట్లాడుతూ.. హెడ్ చెప్పినవీ అబద్ధాలని, అతను తనను దూషించాడని తెలిపాడు. ‘ఓ మంచి బంతిని సిక్సర్ బాదితే ఏ బౌలర్‌కైనా బాధగా ఉంటుంది. ఆ తర్వాతి బంతికే అతన్ని బౌల్డ్ చేయడంతో సంబరాలు చేసుకున్నా. అప్పుడు హెడ్ నన్ను దూషించాడు. నేను అతన్ని ఏం అనలేదు. ప్రెస్ కాన్ఫరెన్స్‌‌లో అతను అబద్ధాలు చెప్పాడు. బాగా బౌలింగ్ చేశావని చెప్పిన మాట అబద్ధం. నేను అందరినీ గౌరవిస్తాను. కానీ, హెడ్ చేసింది సరైంది కాదు. నాకు అస్సలు నచ్చలేదు.’ అని చెప్పుకొచ్చాడు.

Next Story

Most Viewed