- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Shubman Gill equals Pakistan captain Babar Azam's world record
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ మరో ఘతన సాధించాడు. వన్డే సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌పై గత మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించి రికార్డులు సృష్టించాడు. అదే ఫామ్‌లో దూసుకుపోతున్న గిల్.. ఇవాళ ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. 78 బంతుల్లో 5 సిక్స్‌లు,13 ఫోర్లలతో 112 పరుగులతో అద్భుతంగా రాణించాడు. ఈ మ్యాచ్‌లో మరో సెంచరీతో చేసిన గిల్.. మూడు వన్డేల సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచ రికార్డు జాబితాలో చేరిపోయాడు.
మూడు వన్డేల్లో గిల్ మొత్తం 360 పరుగులు చేశాడు. అదే విధంగా 2016లో వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బాబర్ ఆజాం 360 పరుగులు చేయగా.. తన సరసన గిల్ నిలిచాడు. ఇక, వీరి తర్వాత స్థానాల్లో బంగ్లాదేశ్‌కు చెందిన ఇమ్రుల్ కయేస్ (349), దక్షిణాఫ్రికా ప్లేయర్ క్వింటన్ డి కాక్ (342), న్యూజిలాండ్ బ్యాటర్ మార్టిన్ గప్టిల్ (330) పరుగులతో ఉన్నారు.