- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధోనీ OR రోహిత్.. బెస్ట్ కెప్టెన్ ఎవరు?.. ఇంటిలిజెంట్ ఆన్సర్ ఇచ్చిన దూబె
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్‌లో చెన్నయ్ సూపర్ కింగ్స్‌ను ధోనీ ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపితే.. రోహిత్ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ కూడా ఐదుసార్లు టైటిల్ గెలిచింది. అలాగే, ఇద్దరూ టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ అందించారు. కాబట్టి, ఎం.ఎస్ ధోనీ, రోహిత్ శర్మ ఇద్దరిలో ఎవరు బెస్ట్ కెప్టెన్? అంటే చెప్పడం కష్టమే. కానీ, ఈ చిక్కు ప్రశ్నకు టీమ్ ఇండియా యువ బ్యాటర్ శివమ్ దూబె తెలివిగా సమాధానమిచ్చాడు.
తాజాగా భారత టెస్టు, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ, టీ20 కెప్టెన్ సూర్యకుమార్, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌తో కలిసి దూబె కపిల్ శర్మ షోలో పాల్గొన్నాడు. హోస్ట్ దూబెను ఇరుకున పెట్టేందుకు చూశాడు. రోహిత్ ముందే ధోనీ, రోహిత్‌లలో నీకు ఇష్టమైన కెప్టెన్ ఎవరు? అని అడిగాడు. దీంతో రోహిత్, సూర్య అతన్ని ఆటపట్టించారు. ‘దూబె సమస్యలో ఇరుక్కున్నాడు.’ అని రోహిత్ కామెంట్ చేయగా.. ‘చాలా కష్టతరమైన ప్రశ్న అడిగారు’ అని సూర్య చెప్పాడు.
అయితే, దీనికి దూబె ఇంటిలిజెంట్ ఆన్సర్ ఇచ్చాడు. ‘చెన్నయ్‌కు ఆడుతున్నప్పుడు ధోనీ నాకు బెస్ట్ కెప్టెన్. అదే భారత్‌కు ఆడుతుప్పు రోహిత్ బెస్ట్’ అని బదులిచ్చాడు. దూబె సమాధానానికి రోహిత్, సూర్య, అక్షర్‌తోపాటు ప్రేక్షకులు కూడా ఇంప్రెస్ అయ్యారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన దూబె వెన్నెముక గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అతని స్థానంలో యువ బ్యాటర్ తిలక్ వర్మను సెలెక్టర్లు భర్తీ చేశారు.