రోహిత్ ఫిట్‌నెస్‌పై టీమిండియా మాజీ కెప్టెన్ ఆసక్తికర కామెంట్స్

by Vinod kumar |
రోహిత్ ఫిట్‌నెస్‌పై టీమిండియా మాజీ కెప్టెన్ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రోహిత్ ఫిట్‌నెస్‌పై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రోహిత్ బరువు తగ్గాలి.. ఇలా ఉంటే చాలా కష్టమన్నాడు. క్రికెటర్‌కు ఫిట్‌నెస్ చాలా ముఖ్యమని అతడు అభిప్రాయపడ్డాడు. ఫీల్డ్‌లో అతని కదలికలు కూడా చాలా బద్ధకంగా కనిపిస్తాయి. నిజానికి మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా మొదట్లో ఇలాగే ఉన్నా.. తర్వాత కఠినమైన కసరత్తులు చేస్తూ.. డైట్ ఫాలో అవుతూ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ ఫిట్‌నెస్ ఉన్న ప్లేయర్‌గా ఎదిగాడు. కానీ, రోహిత్ మాత్రం ఇప్పటికీ అలాగే ఉన్నాడు. అతని సైజు తరచూ ఎన్నో విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యే రోహిత్ మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి ఇండియన్ కెప్టెన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

ఫిట్‌గా ఉండటం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఓ కెప్టెన్‌కు ఇది చాలా అవసరం. ఫిట్‌గా లేకపోవడం సిగ్గు చేటని.. రోహిత్ ఈ విషయంలో కాస్త కఠినంగా శ్రమించాలి. అతడు గొప్ప బ్యాటరే కావచ్చు కానీ ఫిట్ నెస్ విషయం చూస్తే కాస్త ఎక్కువ బరువు ఉన్నట్లు కనిపిస్తాడని కపిల్ దేవ్ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story