- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆర్సీబీకి మరో ఎదురు దెబ్బ.. యువ బ్యాటర్‌కు గాయం!
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ ట్రోఫీ ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి మరో గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే ఎన్నో అంచనాలతో కొనుగోలు చేసిన విల్ జాక్స్ గాయం కారణంగా ఐపీఎల్ 16వ సీజన్‌కు దూరమవగా.. అలాగే ఆసీస్ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్, పేసర్ జోష్ హాజిల్‌వుడ్ కూడా గాయాలతో పూర్తిగా ఐపీఎల్ ఆడేలా లేరు. ఆర్సీబీ అభిమానులకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆర్సీబీలో కీలకంగా మారిన యువ బ్యాటర్ రజత్ పటీదార్.. గాయం కారణంగా సగం ఐపీఎల్‌కు దూరమయ్యేలా ఉన్నాడు. గతేడాది వికెట్ కీపర్ బ్యాటర్ లువ్‌నిత్ సిసోడియా గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమయ్యాడు.
దీంతో అతని రిప్లేస్‌మెంట్‌గా రజత్ పటీదార్‌ను ఆర్సీబీ తీసుకుంది. కోహ్లీ, డుప్లెసిస్ ఓపెనర్లుగా రావడంతో.. పటీదార్ మూడో స్థానంలో చెలరేగాడు. అద్భుతంగా రాణించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ముఖ్యంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో సెంచరీతో చెలరేగాడు. కానీ ఇప్పుడు అతనికి కూడా గాయమైనట్లు తెలుస్తోంది. కొన్నిరోజుల క్రితమే చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ జట్టు ప్రాక్టీస్ సెషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీనిలో పటీదార్ పాల్గొనలేదు. పటీదార్ మడమకు గాయం అవడంతో అతను నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీయే)లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ గాయం కారణంగా అతనికి కనీసం మూడు వారాల విశ్రాంతి అవసరం అని వైద్యులు తెలిపారట. దీంతో ఐపీఎల్ మొదటి అర్ధభాగంలో పటీదార్ ఆడటం జరగదు.