క్రికెట్ నేర్చుకున్న క్లబ్‌కు నోటీసులు.. ఎమోషనల్ ట్వీట్ చేసిన రిషబ్ పంత్..

by Vinod kumar |   ( Updated:2023-05-02 15:10:44.0  )
క్రికెట్ నేర్చుకున్న క్లబ్‌కు నోటీసులు.. ఎమోషనల్ ట్వీట్ చేసిన రిషబ్ పంత్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తమ క్రికెటర్లుగా తీర్చిదిద్దిన సోనెట్ క్లబ్‌ను తక్షణమే ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడంపై టీమ్‌ ఇండియా క్రికెటర్ రిషభ్‌ పంత్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఆవేదనను తెలియజేస్తూ ట్విటర్‌ వేదికగా పోస్టు చేశాడు. న్యూఢిల్లీలోని వెంకటేశ్వర కాలేజీలో సోనెట్ క్లబ్ ఉంది. ద్రోణాచార్య అవార్డు గ్రహీత అయిన తారక్ సిన్హా ఈ క్లబ్‌లో యువతకు క్రికెట్ పాఠాలే నేర్పేవారు.. టాప్ క్రికెటర్లను అందించిన క్లబ్‌పై ఇలాంటి చర్యలు తీసుకోవడం సరైంది కాదని.. తాను కూడా ఇదే క్లబ్‌ నుంచి క్రికెటర్‌గా వచ్చినట్లు గుర్తు చేసుకున్నాడు. గతేడాది రోడ్డు ప్రమాదం కారణంగా గాయపడిన రిషభ్‌ పంత్‌ విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే.

సోనెట్‌ క్లబ్‌కు సంబంధించిన అంశంపై ఓ పత్రికా విలేకరి చేసిన ట్వీట్‌పై పంత్ స్పందించాడు. ‘‘ఎంతోమంది అంతర్జాతీయ క్రికెటర్లను అందించిన నా క్లబ్‌ పరిస్థితిని చూస్తే బాధేస్తోంది. సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న క్లబ్‌ను ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడం సరైందికాదని.. నా క్రికెట్‌ కెరీర్‌ను పదును పెట్టడంలో క్లబ్ కీలక పాత్ర పోషించింది. దయచేసి వెంకటేశ్వర కళాశాల గవర్నింగ్ బాడీ.. డెసిషన్‌ను వెనక్కి తీసుకోవాలి. సోనెట్‌ క్లబ్‌ను కేవలం ఒక క్లబ్‌లా కాకుండా ఒక ప్రతిష్ఠాత్మక సంస్థగా పరిగణించాలి. మరింత మంది క్రికెటర్లకు అది హోమ్‌గా మారుతుంది ’’ అని రిషభ్ పంత్ ట్వీట్ చేశాడు.

Advertisement

Next Story