- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
చాంపియన్స్ ట్రోఫీకి సర్వం సిద్ధం.. స్టేడియంలో అప్పటిలోగా రెడీ అవుతాయి
![చాంపియన్స్ ట్రోఫీకి సర్వం సిద్ధం.. స్టేడియంలో అప్పటిలోగా రెడీ అవుతాయి చాంపియన్స్ ట్రోఫీకి సర్వం సిద్ధం.. స్టేడియంలో అప్పటిలోగా రెడీ అవుతాయి](https://www.dishadaily.com/h-upload/2025/01/29/416267-national-stadium-in-karachi-08075774-16x91.webp)
- పీసీబీ చైర్మన్ మోషిన్ నఖ్వి
దిశ, స్పోర్ట్స్:
చాంపియన్స్ ట్రోఫీ - 2025ను అనుకున్న ప్లాన్ ప్రకారమే నిర్వహిస్తాము. ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కావల్సిన ఈ టోర్నీ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేదని పీసీబీ చైర్మన్ మోషిన్ నఖ్వీ స్పష్టం చేశారు. కరాచీలోని నేషనల్ స్టేడియంలో ఇంకా పనులు కొనసాగుతుండటంతో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఆందోళన నెలకొంది. పాకిస్తాన్ అధికారిక పత్రిక 'డాన్'లో కూడా టోర్నీ నిర్వహణపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కథనాన్ని ప్రచురించింది. నేషనల్ స్టేడియం రినోవేషన్ అనుకున్న సమయంలోగా పూర్తి చేయడం అసాధ్యమే అనిపిస్తోంది. కానీ దీనికి బాధ్యులైన వాళ్లు మాత్రం తప్పకుండా పూర్తి చేస్తామనే ధీమాగా ఉన్నారు. ఈ విషయంలో పీసీబీ జీరో అయినా కావొచ్చు.. హీరో అయినా కావొచ్చని ఆ కథనంలో పేర్కొంది. కాగా, మంగళవారం రావల్సిండి స్టేడియంను సందర్శించిన మోషిన్ నఖ్వీ.. టోర్నీ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని తెలిపారు. అయితే లాహోర్, కరాచి, రావల్సిండిలోని స్టేడియంలు అనుకున్న ప్రకారం జనవరి 31లోగా రినోవేషన్ పూర్తి చేసుకుంటాయనే విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు న్యూజీలాండ్, సౌతాఫ్రికా, పాకిస్తాన్‌తో నాలుగు మ్యాచ్‌ల ట్రై సిరీస్ ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. మొదటి రెండు మ్యాచ్‌లకు లాహోర్, తర్వాతి రెండు మ్యాచ్‌లకు కరాచీ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే అప్పటిలోగా ఈ స్టేడియంలో అంతర్జాతీయ స్థాయిలో రినోవేట్ అవుతాయా లేదా అనే అనుమానాలు ఉన్నాయి.