ఐపీఎల్ కోసం ఆ పని చేసిన ధోనీ.. వర్కౌట్ అవుతుందా?

by Harish |
ఐపీఎల్ కోసం ఆ పని చేసిన ధోనీ.. వర్కౌట్ అవుతుందా?
X

దిశ, స్పోర్ట్స్ : చెన్నయ్ సూపర్ కింగ్స్(సీఎస్కే) మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ ఐపీఎల్-2025 కోసం సన్నద్ధమవుతున్నాడు. రాంచీలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే, ఈ సారి ధోనీ కొత్త బ్యాటుతో బరిలోకి దిగనున్నట్టు సమాచారం. సాధారణంగా తాను ఉపయోగించే బ్యాటులో కాస్త బరువు తగ్గించినట్టు క్రీడా వర్గాలు తెలిపాయి. ధోనీ అత్యుత్తమ స్థాయిలో ఉన్నప్పుడు అధిక బరువు ఉపయోగించే ఆటగాళ్లలో ఒక్కడిగా గుర్తింపు పొందాడు. సాధారణంగా అతను ఉపయోగించే బ్యాటు బరువు 1250 నుంచి 1300 గ్రాములు ఉంటుంది.

తాజా నివేదిక ప్రకారం.. ధోనీ తన బ్యాటు బరువును 20 గ్రాముల వరకు తగ్గించినట్టు తెలుస్తోంది. 1230 గ్రాములతో బ్యాటును తయారు చేసినట్టు సమాచారం. ‘మీరట్‌కు చెందిన క్రికెట్ పరికరాల కంపెనీ సాన్స్‌పేరిల్స్ గ్రీన్‌ల్యాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ధోనీకి నాలుగు బ్యాట్లను పంపించింది. ప్రతి బ్యాటు బరువు దాదాపుగా 1230 గ్రాములు ఉంది. గతంలో ధోనీ ఉపయోగించిన బ్యాటులాగే ఉంటుంది.’అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పిచ్‌లను ఉపయోగించొద్దన్న బీసీసీఐ ఆదేశాల నేపథ్యంలో మార్చి 10 తర్వాతే చెపాక్ స్టేడియంలో సీఎస్కే క్యాంప్ మొదలుకానుంది. ప్రస్తుతం రాంచీలో ప్రాక్టీస్ చేస్తున్న ధోనీ..నైపుణ్యాలకు పదును పెట్టడానికి బౌలింగ్ మెషిన్‌తో సాధన చేస్తున్నాడు.


Next Story

Most Viewed