- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Mohammed Shami: టీమిండియా స్టార్ షమి ఖాతాలో ప్రపంచ రికార్డు

దిశ, వెబ్ డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో బంగ్లాపై విజయం సాధించి భారత్ మంచి శుభారంభం ఇచ్చింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమి ప్రపంచ రికార్డు సాధించాడు. బంగ్లాతో మ్యాచ్‌లో షమి ఐదు వికెట్లను పడగొట్టాడు. దీంతో వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. షమి ఇప్పటి వరకు 104 మ్యాచుల్లో 5,126 బంతుల్లో 200 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ జాబితాలో ఆస్ట్రేలియా సూపర్ స్టార్ మిచెల్ స్టార్క్ (102 ఇన్నింగ్స్‌లలో 5,240 బంతుల్లో 200 వికెట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. అలాగే ఐసీసీ ఈవెంట్స్‌లో అత్యధిక సార్లు 5 వికెట్ల ఘనత సాధించిన టీమిండియా బౌలర్‌గా నిలిచాడు.
దీంతో పాటు ఐసీసీ వైట్‌బాల్ ఈవెంట్స్‌లో మెన్ ఇన్ బ్లూ తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గానూ చరిత్ర సృష్టించాడు. అలాగే వన్డేల్లో 200 వికెట్లు పడగొట్టిన ఫాస్టెస్ట్ ఇండియన్ బౌలర్‌గా నిలిచాడు. అజిత్ అగార్కర్ 133 మ్యాచ్‌ల్లో 200 వికెట్లు సాధించగా, షమి 104 మ్యాచుల్లోనే ఈ ఘనత అందుకున్నాడు. దీంతో అగార్కర్ రికార్డును బ్రేక్ చేశాడు.
కాగా, 2023 వన్డే ప్రపంచకప్‌లో గాయపడి, సర్జరీ చేయించుకున్న షమి దాదాపు ఏడాదిన్నర పాటు టీమిండియాకు దూరంగా ఉన్నాడు. ఈక్రమంలో షమి రీఎంట్రీలో ఫిట్ నెస్‌పై సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే బంగ్లాదేశ్‌తో అద్భుత బౌలింగ్‌తో తన ఫిటనెస్, ఫామ్‌పై సందేహాలను షమి పటాపంచలు చేశాడు. తొలి ఓవర్లోనే వికెట్‌తో అదరగొట్టాడు. ఆఖర్లోనూ ప్రత్యర్థిని కట్టడి చేశాడు.