- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహమ్మద్ షమీ ఇన్.. సిరాజ్ ఔట్..!
దిశ, వెబ్ డెస్క్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఊహించని ఓటమి భారత జట్టు లొసుగులను మరోసారి బయటపెట్టింది. దీంతో తుది జట్టుపై సీరియస్‌గా ఫోకస్ పెట్టిన రోహిత్ సేన అహ్మదాబాద్ వేదికగా మార్చి 9 నుంచి ప్రారంభం కానున్న చివరి టెస్ట్‌కు సమయాత్తమవుతోంది. ఈ సిరీస్ గెలవాలన్నా.. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలన్నా చివరి టెస్ట్ మ్యాచ్ గెలవడం భారత్ కు తప్పనిసరి. ఇండోర్ పిచ్‌కు ఐసీసీ పూర్ రేటింగ్ ఇవ్వడంతో అహ్మదాబాద్ వేదికగా ఎలాంటి పిచ్ సిద్ధం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు సమష్టి ప్రదర్శనతో విజయాన్నందుకున్న ఆసీస్ అదే జోరులో అహ్మదాబాద్ టెస్ట్ గెలిచి సిరీస్ సమం చేయాలనుకుంటుంది. విన్నింగ్ కాంబినేషన్‌ను కాదని రెండు మార్పులతో ఇండోర్ టెస్ట్ బరిలోకి దిగిన టీమిండియా భారీ మూల్యం చెల్లించుకుంది. కేఎల్ రాహుల్ స్థానంలో వచ్చిన శుభ్‌మన్ గిల్ సైతం బ్యాటింగ్ లో విఫలమయ్యాడు. మహమ్మద్ షమీ స్థానంలో బరిలోకి దిగిన ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు. దీంతో అతను చివరి టెస్ట్‌లోనూ అవకాశం అందుకోనున్నాడు.
మరోవైపు వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా మూడో టెస్ట్ నుంచి మహమ్మద్ షమీకి విశ్రాంతినివ్వగా.. అతను ఆఖరి టెస్ట్‌లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అప్పుడు హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. టర్నింగ్ ట్రాక్స్ కావడంతో గత మూడు మ్యాచ్‌ల్లో సిరాజ్ ఫీల్డింగ్‌కే పరిమితమయ్యాడు. మూడు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క వికెట్ తీసాడు. ఈ నేపథ్యంలో మహమ్మద్ సిరాజ్‌ను ఆఖరి టెస్ట్‌కు పక్కన పెట్టనున్నారు.
తుది జట్టు అంచనా..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కే.ఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్/ఉమేశ్ యాదవ్.