Champions Trophy : న్యూజిలాండ్‌కు భారీ షాక్.. భారత్‌తో ఫైనల్‌కు కివీస్ స్టార్ పేసర్ దూరం?

by Harish |
Champions Trophy : న్యూజిలాండ్‌కు భారీ షాక్.. భారత్‌తో ఫైనల్‌కు కివీస్ స్టార్ పేసర్ దూరం?
X

దిశ, స్పోర్ట్స్ : చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాతో ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలేలా కనిపిస్తున్నది. ఆ జట్టు స్టార్ పేసర్ మ్యాట్ హెన్రీ ఫైనల్ ఆడటంపై అనిశ్చితి నెలకొంది. బుధవారం సౌతాఫ్రికాతో జరిగిన సెమీస్‌లో హెన్రీ గాయపడ్డాడు. హెన్రిచ్ క్లాసెన్ బాదిన బంతిని అందుకునే క్రమంలో అతని భుజానికి గాయమైంది. కివీస్ కెప్టెన్ శాంట్నర్ ఫైనల్‌కు హెన్రీ అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నట్టు చెప్పాడు. అయితే, హెడ్ కోచ్ గ్యారీ స్టీడ్ మాత్రం హెన్రీ ఫిట్‌నెస్‌ గురించి ఇప్పుడే ఏం చెప్పలేమని తెలపడం గమనార్హం. దీంతో హెన్రీ ఫైనల్ ఆడతాడా?లేదా? అన్నది అనుమానంగా మారింది. ప్రస్తుతం టోర్నీలో లీడింగ్ వికెట్ టేకర్ అతనే. 10 వికెట్లు పడగొట్టాడు. గ్రూపు దశలోనే భారత్‌పై ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. టైటిల్ పోరుకు అతని సేవలు కోల్పోతే కివీస్‌కు భారీ లోటే అని చెప్పొచ్చు. హెన్రీ ఆడకపోతే బెంచ్‌కే పరిమితమైన మరో పేసర్ జాకబ్ డఫీ అతని స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది.


Next Story

Most Viewed