- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సౌదీ అరేబియా క్లబ్‌తో మెస్సీ ఒప్పందంపై అతని తండ్రి క్లారిటీ
న్యూఢిల్లీ: అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ సౌదీ అరేబియా ఫుట్‌బాల్ క్లబ్ అల్ హిలాల్‌తో భారీ మొత్తానికి ఒప్పందం చేసుకున్నట్టు వార్తలు వైరల్ అయ్యాయి. గత వారం అతను సౌదీ అరేబియా వెళ్లడంతో ఈ వార్తలు పుట్టుకొచ్చాయి. మెస్సీ క్లబ్ మారుతున్నట్టు వస్తున్న వార్తలను మెస్సీ తండ్రి జార్జ్ మెస్సీ ఖండించాడు. అవన్నీ ఫేక్ న్యూస్ అంటూ నిర్దారించాడు. ‘వచ్చే సీజన్ కోసం ఏ క్లబ్‌తో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు.
ప్రస్తుత సీజన్ చివర్లో మెస్సీ దీనిపై నిర్ణయం తీసుకుంటాడు’ అని జార్జ్ మెస్సీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మెస్సీ ఫ్రాన్స్ ఫుట్‌బాల్ క్లబ్ పారిస్ సెయింట్ జెర్మైన్(పీఎస్‌జీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్‌తో ఒప్పందం ముగిసిన అనంతరం 2021లో మెస్సీ పీఎస్‌జీలో చేరాడు. ఆ క్లబ్‌తో మెస్సీ రెండేళ్ల ఒప్పందం ముగియనుంది. అయితే, మెస్సీ కాంట్రాక్ట్‌ను పొడిగించేందుకు పీఎస్‌జీ ఆసక్తిగా లేదని తెలుస్తోంది. ఇటీవల మెస్సీ ట్రైనింగ్‌ను విడిచిపెట్టి సౌదీ అరేబియా వెళ్లడంపై సీరియస్ అయిన క్లబ్.. అతన్ని రెండు వారాలపాటు సస్పెండ్ చేసింది.