Investment Plan: రూ. 5వేలతో చేతికి అరకోటి..ఈ స్కీముతో డబ్బే డబ్బు

by Vennela |   ( Updated:2025-02-13 15:43:59.0  )
Investment Plan: రూ. 5వేలతో చేతికి అరకోటి..ఈ స్కీముతో డబ్బే డబ్బు
X

దిశ, వెబ్‌డెస్క్: Investment Plan: రూ. 5వేల పెట్టుబడితో రూ. 50లక్షలు సంపాదించడం ఎలాగో తెలుసుకుందాం. ఇలా చేస్తే ఎలాంటి రిస్క్ లేకుండానే మంచి రాబడి వస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను చూద్దాం.

సిప్ ద్వారా మీరు ప్రతినెలా నిర్దిష్ట మొత్తాన్నిచెల్లించి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది మంచి లాభాలను పొందడానికి సహాయం చేస్తుంది. ఎందుకంటే మార్కెట్ పైకి కిందకు పడినప్పటికీ సగటు ధరపై పెట్టుబడులు చేయడం వల్ల ప్రమాదం తగ్గుతుంది. దీంతో సమయం గడిచేకొద్దీ మీ పెట్టుబడుల విలువ పెరుగుతాయి. సిప్ ఒక ముఖ్యమైన లాభాన్ని ముట్టుకోకుండా క్రమంగా పెట్టుబడులు పెంచడమే దీని లక్షణమని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల చిన్న మొత్తాలు పెద్ద మొత్తాలుగా మారుతాయి. దీని ద్వారా పొదుపు చేయడం కూడా సులభంగా ఉంటుంది. అయితే రూ. 9వేల నెలలవారీ ఇన్వెస్ట్ మెంట్ తో రూ. 10కోట్లను సృష్టించడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. కానీ మీరు సిప్, కాంపౌండింగ్ పవర్ ద్వారా దీనిని నిజం చేసుకోవచ్చు. ఇది ఎలా సాధ్యమూ ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఈ నెలలవారీ పెట్టుబడితో రిటైర్ మెంట్ కార్పస్ ఎలా స్రుష్టించవచ్చు అనే దానిపై కచ్చితమైన లెక్కలు తెలుసుకోవాలి.

సిప్ అనేది ఒక పెట్టుబడి పథకం. ఇందులో పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్స్ లో ఒక స్థిరమైన మొత్తాన్ని పెట్టుబడిగా పెడతారు. పెట్టుబడిదారులు వారి అనుకూలత ప్రకారం రోజువారీ, వారపు, నెలలవారీ, త్రైమాసిక లేదా వార్షిక పెట్టుబడులు చేయవచ్చు. సిప్ ప్రారంభించేవారికి అనుకూలంగా ఉంటుంది. కేవలం రూ. 100ను మీరు ప్రతినెలా పెట్టుబడి పెడితే ఇది పెద్ద కార్పస్ ను స్రుష్టించడంలో మొదటి అడుగు అవుతుంది. దీంతో మీరు పెట్టుబడిని తప్పకుండా చేయవచ్చు. ఎందుకంటే ఆటోమేటెడ్ డిడక్షన్స్ ద్వారా మీరు పెట్టుబడులను మిస్ కాకుండా ఉంటారు.

25ఏళ్ల వయస్సులో ప్రారంభింకిన రూ. 5000 నెలలవారీ పెట్టుబడిని 45ఏళ్ల వరకు పెడితే మొత్తం పెట్టుబడి రూ. 12,00, 000లు అవుతుంది. 12శాతం వార్షిక రాబడితో రూ. 50, 00, 000 పొందవచ్చు. 35ఏళ్ల వయస్సులో ప్రారంభించి రూ. 5000 నెలలవారీ పెట్టుబడిని 55సంవత్సరాల వరకు పెడితే మొత్తం పెట్టుబడి రూ. 12,00, 000లు అవుతుంది. అది 12శాతం వార్షిక రాబడితో రూ. 28, 00, 000లు పొందవచ్చు. పెట్టుబడి 10ఏళ్లు ముందుగా ప్రారంభించడం వల్ల రూ. 22,00, 000ఎక్కువగా సంపాదించవచ్చు. ఇది కాంపౌండింగ్ శక్తిని అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడుతుంది.

Advertisement
Next Story